Site icon NTV Telugu

Dharmendra : హేమమాలినితో రెండో పెళ్లికి వెనకున్న నిజాలు, అప్పటి హాట్ టాపిక్స్.. !

Darmendra Hemamalini Love

Darmendra Hemamalini Love

బాలీవుడ్ లెజెండరీ హీరో ధర్మేంద్ర (89) నవంబర్ 24న కన్నుమూసిన విషయం తెలిసిందే. 1935లో పంజాబ్‌లో జన్మించిన ఆయన, 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే తో ఇండస్ట్రీలో అడుగు పెట్టి, ఆరు దశాబ్దాలపాటు బాలీవుడ్‌కు అనేక క్లాసిక్‌ సినిమాలు అందించారు. ఆయన మొదటి పెళ్లి – కుటుంబం గురించి మాట్లాడు కుంటే కేవలం 19 ఏళ్ల వయసులో ధర్మేంద్ర, ప్రకాశ్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. వారికి సన్నీ డియోల్, బాబీ డియోల్ తో పాటు కుమార్తెలు విజేత, అజిత అన్నారు. మరి..

Also Read : Ustaad Bhagat Singh :‘ఉస్తాద్ భగత్ సింగ్’..‘తేరి’ రీమేక్ టాక్‌పై నిర్మాత క్లారిటీ!

హేమమాలినితో ప్రేమ ఎలా మొదలైంది? అంటే.. 1970లలో హేమమాలిని తో వరుసగా చేసిన సినిమాలు ఈ జంటను దగ్గర చేశాయి. సీతా ఔర్ గీత, షోలే వంటి హిట్లతో వీరి కెమిస్ట్రీ అప్పటికే పబ్లిక్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. అప్పటి సమాచారం ప్రకారం ‘షోలే’ షూటింగ్ సమయంలో హేమాను కౌగిలించుకునే సీన్స్ కోసం మరిన్ని టేకులు రావాలని చూస్తూ ధర్మేంద్ర, లైట్‌బాయ్స్‌కి డబ్బులు ఇచ్చేవారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ రోజుల్లో ఆయన ఇందుకోసం రూ. 2000 వరకు ఖర్చు చేశారని బాగా ప్రచారం జరిగింది.

రెండో పెళ్లి ఎలా జరిగింది? అంటే ధర్మేంద్ర హేమమాలినిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, ఆయన మొదటి భార్య ప్రకాష్ కౌర్ అంగీకరించలేదు. అప్పుడు మీడియాలో వచ్చిన రిపోర్టుల ప్రకారం.. ధర్మేంద్ర ఇస్లాం మతం స్వీకరించి, దిలావర్ ఖాన్ అనే పేరుతో 1980లో హేమమాలినిని వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఒక భార్య ఉన్నప్పుడు రెండో పెళ్లి చేయడానికి ఇస్లాం చట్టం అనుమతిస్తుంది కాబట్టి, అదే కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పటి కథనాలు చెప్పాయి. కానీ,

ఈ వ్యవహారం ధర్మేంద్ర మొదటి కుటుంబం ముఖ్యంగా సన్నీ డియోల్, బాబీ డియోల్ పై చాలా ప్రభావం చూపింది. కొంతకాలం వరకు ధర్మేంద్ర రెండు కుటుంబాల్ని బ్యాలెన్స్ చేయడంలో ఇబ్బంది పడ్డారు అనే కథనాలు పాపులర్ అయ్యాయి. మొదటి భార్య ప్రకాష్ కౌర్ ఎప్పుడూ ఆయనపై నెగెటివ్‌గా మాట్లాడలేదు, కానీ ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు అప్పట్లో హెడ్లైన్స్ అయ్యాయి.. “ధర్మేంద్ర మంచి తండ్రి, తన బాధ్యతల్ని చూసుకుంటాడు. కానీ ఒక భార్యగా నా బాధను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు.” అని మొత్తానికి హేమమాలినితో రెండో పెళ్లి అలా జరిగింది.

Exit mobile version