Site icon NTV Telugu

MP Arvind: అవును.. శ్రీరాముడికి బీజేపీ మెంబర్ షిప్ ఉంది.. ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Mp Arvind Kumar

Mp Arvind Kumar

MP Arvind: శ్రీరాముడికి బీజేపీ మెంబర్ షిప్ ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్‌ని ఇందూర్‌గా పేర్కొన్న ఆయన.. ఆ పేరు ఎలా వచ్చిందో చారిత్రిక ఆధారాలు ఉన్నాయన్నారు. తాజాగా మీడియాలో మాట్లాడిన ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాం ఒక హంతకుడు.. నిజామాబాద్‌కి ఆయన పేరు ఎందుకు పెట్టుకుంటారన్నారు. ఇందూర్‌గా పేరు మార్చి ఆ తీర్మానాన్ని ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డికి పంపిస్తామన్నారు. శ్రీరాముడికి బీజేపీ మెంబర్ షిప్ ఉందని అనుమానం ఉంటే వెళ్లి చూసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌కు తెలిపారు. ముస్లిం అంటే కాంగ్రెస్ అంటున్నారు.. మీ పార్టీకి సున్తీ అయిందా పోయి చూసుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో హిందువులా? ముస్లింలా? అని చూసి కాల్చి చంపారని గుర్తు చేశారు. కొంత మంది హిందువుల్లో చెడ పుట్టారన్నారు. తెలంగాణ మొత్తం కాషాయమయం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎక్కడుందో కవితను అడిగితే చెబుతుందన్నారు.. రేపు సిరిసిల్లలో కూడా చూపిస్తామన్నారు. ఇందూర్‌కి దమ్ముంటే రా అని కేటీఆర్‌కి సవాల్ విసిరారు.

READ MORE: UP Video: ముఖ్యమంత్రి చెవిలో బుడ్డోడు గుసగుసలు.. వింతైన కోర్కెకు నవ్వుకున్న యోగి

చెన్నారెడ్డి సీఎంగా రాజీనామా చేసే వరకు రాష్ట్రంలో మత ఘర్షణలు జరిగాయని ఎంపీ అరవింద్ తెలిపారు. “గొడవలకు కారణం కాంగ్రెస్.. అప్పట్లో సత్తయ్య ఏసీపీని చంపితే ఆ నిందితులను బయటకు తెచ్చింది మజ్లిస్.. తిన్న తిండి అరగక హిందూ దేవాలయాల మీద పడుతున్నారు.. దీనికి కారణం రేవంత్ రెడ్డి.. ఇచ్చేది దొంగ వాగ్దానాలు.. హిందూ దేవుళ్ళ మీద ఓట్లు.. గులాంలుగా మారి పోయి హిందువులను తాకట్టు పెడుతున్నారు.. నూటికి నూరు శాతం ఇందూర్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురవేస్తాం.. నిజామాబాద్ పేరును ఇందూర్‌గా మారుస్తాం… తీర్మానం చేసి రాష్ర్ట ప్రభుత్వానికి పంపిస్తాం.. నిజాంను ఒకే సారి నేను గాడిద అని ఒక్కసారి అంటే దానిపై రాద్ధాంతం చేస్తున్నారు.. నిజాం చరిత్రలో దుర్మార్గమైన రాజు గానే మిగిలి పోతారు.. ఆయన పేరు చెబితే హిందువులకు గుర్తుకు వచ్చేది అయన చేసిన మారణకాండనే.. ముస్లింలకు అవాస్ యోజన కింద ఇల్లు, ఫ్రీ రేషన్, ఫ్రీ వాక్సినేషన్ మోడీ ఇస్తున్నారు.. ముస్లిం దేశాలకు కూడా వ్యాక్సిన్ పంపించారు.. మీ పిల్లలకు విద్యా, వైద్యం ఇస్తుంది.. నిజాం అంత వెనుకోసుకొస్తున్నా.. రేవంత్ రెడ్డి ఏం చేశారని ఓట్లు వేస్తున్నారు.. ఇన్ని చేసినా మోడీకి ఎందుకు వేయడం లేదు.. ఇదేనా మీ ఇమాందారీ..” అని ఎంపీ వ్యాఖ్యానించారు.

Exit mobile version