Dharmakshetra: టాలీవుడ్లో సరికొత్త చరిత్ర: 30 రోజుల్లోనే భారతదేశపు తొలి ఏఐ ఇండిపెండెంట్ మూవీ “ధర్మక్షేత్ర” ముస్తాబు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmakshetra: హైదరాబాద్: సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ, వినోద రంగంలో సరికొత్త విప్లవానికి తెరతీసింది ఓ హైదరాబాద్ ఆధారిత టెక్ బృందం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కేవలం 30 రోజుల్లోనే భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి ఏఐ తెలుగు ఇండిపెండెంట్ చలనచిత్రం ‘ధర్మక్షేత్ర’ను రూపొందించి చరిత్ర సృష్టించింది.
సాధారణంగా ఒక సినిమా తెరకెక్కాలంటే నెలల నుంచి సంవత్సరాల తరబడి సమయం పడుతుంది. కానీ, సరైన ప్రణాళిక, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఉంటే నటీనటులు, వాస్తవ సెట్స్ తో పనిలేకుండానే ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వొచ్చని ఈ చిత్రం నిరూపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో విశేషంగా ట్రెండ్ అవుతోంది.
Also Read
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
- Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
అపోహలు పటాపంచలు చేస్తూ..
ఏఐతో కేవలం మైథలాజికల్ లేదా ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ కథలు మాత్రమే తీయగలరనే ఒక అపోహ ఇండస్ట్రీలో ఉంది. ఆ అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ, ‘ధర్మక్షేత్ర’ను ఒక సోషియో-పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాగా మలిచారు. భారతీయ సమాజం, రాజకీయ వ్యవస్థలో వస్తున్న మార్పులకు కాస్త కల్పితాన్ని జోడించి ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించారు.
ఆటుపోట్లను అధిగమించి టెక్నాలజీతో ముందుకెళ్లి ..
టాలీవుడ్లో గొప్ప సినిమాలు చేయాలనే ప్యాషన్‌తో ప్రయాణం మొదలుపెట్టిన ఈ యువ బృందం.. సాంప్రదాయ సినిమా నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లు, మార్కెటింగ్ కష్టాలను బేరీజు వేసుకుంది. వాటిని అధిగమించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విజువల్ క్రియేషన్ టూల్స్‌పై లోతైన అధ్యయనం చేసి, పూర్తి పట్టు సాధించిన అనంతరం ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు.
హ్యూమన్ ఎమోషన్స్, ఒరిజినల్ సౌండ్..
ఏఐతో సినిమాలు చేస్తే అందులో భావోద్వేగాలు పండవనే విమర్శలకు ఈ చిత్రం బలమైన సమాధానం చెబుతోంది. హృదయానికి హత్తుకునే కథ, కథనాలతో పాటు, పాత్రల మధ్య కనెక్ట్ అయ్యే ఎమోషన్స్‌ను అద్భుతంగా క్రియేట్ చేశారు. ఈ రియలిస్టిక్ ఫీల్‌ను రెట్టింపు చేయడానికి ఒరిజినల్ మ్యూజిక్, ప్రొఫెషనల్ డబ్బింగ్ జోడించడం విశేషం.
బలమైన కథ, కచ్చితమైన ప్రణాళిక ఉంటే తక్కువ బడ్జెట్‌తో కూడా ఏఐ సాయంతో వరల్డ్ క్లాస్ చలనచిత్రాలను నిర్మించడం సాధ్యమేనని ‘ధర్మక్షేత్ర’ బృందం నిరూపించింది. వినూత్న ప్రయోగాలను ఆదరించే టాలీవుడ్ ప్రేక్షకులను, సినీ పరిశ్రమ వర్గాలను ఈ చిత్రం కచ్చితంగా ఆకర్షిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ధర్మక్షే త్ర మూవీ థీమ్ ఏంటి?
“ధర్మక్షేత్ర” సినిమా ఎందుకు చూడాలనే ప్రశ్న చాలా మందికి రావొచ్చు. ప్రతి ఒక్కరికి ఇండియా ఇలా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం ఉంటుంది. ఈ సినిమా పూర్తిగా మీ ఊహలు, ఆలోచనల ఆవిష్కారం. ఇండియాని రూల్ చేస్తోన్న పొలిటికల్ సిస్టమ్ కరెక్ట్ గా ఉంటే, టెక్నాలజీని సరైన విధంగా ఉపయోగించుకుంటే, దేశ ప్రజలందరికి ఒకే డిజిటల్ యూనిక్ ID ఉంటే, అవినీతి రహిత సమాజాన్ని ఎలా నిర్మించొచ్చు, మన విజ్ఞానాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకుంటే అద్భుతమైన ఇండియాని ఎలా ఆవిష్కరించవచ్చు అనేది ఈ “ధర్మక్షేత్ర” మూవీలో మీరు చూడబోయే కథాంశం. అయితే ఇందులో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.
ఎక్కడ చూడాలి
ఈ “ధర్మ క్షేత్ర” మూవీ AINethra-Official
https://www.youtube.com/@AiNethra-Official యూట్యూబ్ ఛానల్ లో చూడొచ్చు. సరికొత్త ఎక్స్ పీరియన్స్ అందించే ఈ సోషియో పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా కచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. లింక్ క్లిక్ చేసి నేరుగా మూవీని ఆస్వాదించవచ్చు.
అవకాశం
మీకు అద్భుతమైన కథలు రాయగలిగే సామర్ధ్యం ఉందా?… సిల్వర్ స్క్రీన్ పై మీ కథని అద్భుతంగా తీయగలిగే సత్తా ఉందా? నటుడిగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని ఉందా? టెక్నీషియన్స్ గామీ టాలెంట్ ని అందరికి పరిచయం చేయాలని అనుకుంటున్నారా? డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మీ గొంతుతో నటనని పలికించాలని అనుకుంటున్నారా? అయితే ఏఐ నేత్ర మీకు ఆ అవకాశం ఇస్తుంది. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే మీకో అద్భుతమైన ఛాన్స్ అందించడానికి మా ప్రొడక్షన్ సిద్ధంగా ఉంది. మమ్మల్ని ఎలా సంప్రదించాలంటే?
Contact details:
Contact@ainethra.com
8247061669
తాజావార్తలు
-
Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
-
Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
ట్రెండింగ్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!