తెలంగాణ సచివాలయ ఉద్యోగి ధర్మా కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ధర్మా హత్య చేసింది బాబు అనే వ్యక్తిని అని గుర్తించారు పోలీసులు. అయితే.. బాబు అనే వ్యక్తిది మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలోని లాగ్ లుడ్ గ్రామం. కూలి పనులకు బాబు నిత్యం లాగ్ లూడ్ నుంచి నిజామాబాద్ కి ట్రైన్ లో వస్తుండేవాడు. అయితే.. ధర్మా లాగా ఉండటంతో బాబుకు పని ఉందని చెప్పి పిలిచి ధర్మా, అతని అల్లుడు శ్రీనివాస్ హత్య చేసినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలు, ఆధార్ కార్డ్ ఆధారంగా బాబు అడ్రస్ గుర్తించారు పోలీసులు. బాబు హత్య జరిగిన ప్రాంతాన్ని కుటుంబ సభ్యులకు చూపించారు పోలీసులు.
Also Read : Dharma Case Details: తెలంగాణ సచివాలయ ఉద్యోగి కేసులో పురోగతి.. ధర్మ హత్యచేసిన వ్యక్తి బాబుగా గుర్తింపు
ఈ నెల 9వ తేదీన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్ సమీపంలో కారులో కాలిపోయిన మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన ప్రమాదమా లేక హత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో పెట్రోల్ బాటిల్ లభ్యమైంది. దీంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో దిమ్మతిరికే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సచివాలయ ఉద్యోగి ధర్మానాయక్ ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ లో రూ. 2 కోట్లు అప్పులు చేశాడు. ధర్మాకు రెండుకోట్ల అప్పులు ఎలా తీర్చాలని భయం పట్టుకుంది. ఓ.. ఐడియా మైండ్ లో మొదలైంది. చనిపోయినట్లు నటిస్తే రూ. బీమా సొమ్ము రూ.7 కోట్లు వస్తాయి కాదా.. దాంతో అప్పులు తీర్చవచ్చని ధర్మానాయక్ భావించాడు.
Also Read : Ramgopalpet Fire Accident: అదుపులోకి రాని మంటలు.. భవనం కూల్చివేసేందుకు..
ఈ నెల 5న హైదరాబాద్ నుంచి కుటుంబసభ్యులతో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లాలోని స్వగ్రామానికి బయలుదేరాడు. కుటుంబ సభ్యులను ఇంటి వద్ద వదిలిపెట్టాడు. మొదట దర్మలాగా ఉన్న వ్యక్తి కోసం వెతికారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో బాబు అనే వ్యక్తిని తీసుకొచ్చారు. అతనికి బాసరలో గుండు గీయించి, ధర్మ బట్టలు వేశారు. అదే కారులో వెంకటాపూర్‌కి తీసుకొచ్చారు. చెరువు దగ్గరికి రాగానే, అతడ్ని కారు ముందుకు రమ్మన్నారు. అతడు సహకరించకపోవడంతో.. గొడ్డళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో బాబు చనిపోవడంతో.. అతని మృతదేహాన్ని కారు ముందు పెట్టి, కాలువలోకి తోసేసి, పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఏంచేసిన ఎంత పన్నాగం పనిన్నా చివరకు జైలు పాలు అయ్యారు. నిందితులపై 302, 364, 120B, 201, 202, 212 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.