Site icon NTV Telugu

Dharani Portal: ధరణిలో సమస్యల పరిష్కారంపై సర్కార్ ఫోకస్..

Dharani

Dharani

Dharani Portal: ధరణిలో సమస్యల పరిష్కారంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సచివాలయంలో ధరణి కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. పోర్టల్ ప్రక్షాళనపై కమిటీ చర్చించారు. ధరణిలో భూముల సమస్యలు చాలా ఉన్నాయని కమిటీ తెలిపింది. సీసీఎల్ఎ కార్యాలయం వేదికగా కమిటీ పనిచేస్తోందని చెప్పారు. వారం రోజుల్లో కమిటీ మళ్లీ సమావేశం అవుతుందని అన్నారు. ఆన్ లైన్ లో చాలా భూములు ఎక్కలేదని.. సన్నకారు, చిన్నకారు రైతులు గుంట భూమి అమ్మడానికి ఇబ్బంది పడ్డారన్నారు. గతంలో తప్పులు పునరావృతం కాకుండా అడుగులు వేస్తామని తెలిపారు.

Mallikarjuna Kharge: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలవాలి..

ధరణిలో ఇప్పటి వరకు 119 లోపాలను గుర్తించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పటిష్టమైన ధరణి సాఫ్ట్ వేర్ అవసరం అని పేర్కొన్నారు. ఆర్వో యాక్ట్ ఉన్నప్పటికీ.. స్పష్టమైన గైడ్ లైన్స్ లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయని గుర్తించారు. రెవెన్యూలో సరైన బిజినెస్ రూల్స్ లేవని.. రెవెన్యూలో అధికార వికేంద్రీకరణ లేకపోవడం వల్ల సమస్య ఉత్పన్నం అయినప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇక నుంచి భూ సమస్యలు వస్తే అధికార వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. మండల స్థాయిలో భూ సమస్యలను పరిష్కరించేందుకు.. డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిల్లో మార్గదర్శకాలు విడుదల చేయనుంది ధరణి కమిటీ.

Jangaon DMHO: ఏసీబీకి చిక్కిన అవినీతి చేప.. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ..!

Exit mobile version