Site icon NTV Telugu

Ponguleti Srinivas Reddy : ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ

Ponguleti

Ponguleti

సచివాలయంలో ధరణి కమిటీతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారాల కోసం ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తామని నిన్న తెలిపారు ధరణి కమిటీ సభ్యులు. ఈ నేపథ్యంలో మధ్యంతర నివేదికపై రెవెన్యూ శాఖ మంత్రి తో చర్చిస్తున్నారు కమిటీ సభ్యులు. రేపు సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు మరో రెండు జిల్లాలు… మొత్తం నాలుగు జిల్లాల కలెక్టర్లతో రేపు సిసిఎల్ఎలో సమావేశం కానుంది ధరణి కమిటీ. ధరణిపై వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఇబ్బందులు రాకుండా చూసుకోవడమూ కూడా అంతే ముఖ్యమని చెప్పారు.

తమ కమిటీ ఏ సమస్యనూ పరిష్కరించదని, నివేదికను మాత్రమే సిద్ధం చేస్తుందని వివరించారు. వివిద రాష్ట్ర ల యొక్క రెవెన్యూ విధి విధానాలను కమిటీ పరిశీలిస్తుందని అన్నారు. క్షేత్ర స్థాయి భూ సమస్యలపై ఆరా తీయనున్న కమిటీ, అనంతరం రెవెన్యూ శాఖ మంత్రికి పూర్తి స్థాయి మధ్యంతర నివేదిక ఇవ్వనుంది కమిటీ. కమిటీ మధ్యంతర నివేదికపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించనున్నారు మంత్రి పొంగులేటి. ధరణి పోర్టల్‌ను మరింత పటిష్టం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నట్టు ధరణి పునర్నిర్మాణ కమిటీ పేర్కొంది. ప్రజలు ఇబ్బందులు పడకుండా సాఫ్ట్‌వేర్‌తోపాటు చట్టాల్లో ఎలాంటి మార్పుచేర్పులు చేయవచ్చో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపింది.

Exit mobile version