NTV Telugu Site icon

Dhanush : ధనుష్ DNS మూవీ ఫస్ట్ లుక్ అప్డేట్.. దేవిశ్రీ లుక్ వైరల్..

Whatsapp Image 2024 03 08 At 12.42.10 Pm

Whatsapp Image 2024 03 08 At 12.42.10 Pm

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్  కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ చిత్రం DNS. హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాల తో లాంఛ్ కాగా..స్టిల్స్‌ ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఇదిలా ఉంటే నేడు మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం 4:05 గంటలకు సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు.. ఈ చిత్రానికి రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు.తాజాగా డీఎస్పీ రాకింగ్ బీజీఎం తో DNS ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదల కాబోతుందంటూ మేకర్స్‌ స్టూడియోలో ఉన్ లుక్‌ ను షేర్ చేయగా.. నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఏషియన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సునీల్ నారంగ్‌ మరియు పుస్కూరి రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సోషల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.రష్మిక ఇటీవలే హైదరాబాద్‌ లో జరుగుతున్న షూటింగ్‌కు నుంచి విరామం తీసుకొని జపాన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమానికి వెళ్లగా.. ఈవెంట్‌ స్టిల్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి. DNS తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో గ్రాండ్‌ గా విడుదల కానుంది.లవ్‌స్టోరీ లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత శేఖర్‌ కమ్ముల నుంచి వస్తున్న సినిమా కావడం తో ప్రేక్షకులలో అంచనాలు భారీ గా వున్నాయి..ఇదిలా ఉంటే ధనుష్‌ మరోవైపు స్వీయ దర్శకత్వం లో 50వ సినిమా చేస్తున్నాడు.’D50’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ కమ్‌ యాక్టర్ ఎస్‌జే సూర్య ఈ ప్రాజెక్టు లో ముఖ్య పాత్ర లో నటిస్తున్నట్లు సమాచారం.