NTV Telugu Site icon

Raayan Twitter Review: ‘రాయన్’ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్‌ ఇరగదీశాడు! సెకండ్ హీరో రెహ్మాన్

Raayan Twitter Review

Raayan Twitter Review

Dhanush’s Raayan Twitter Review: కోలీవుడ్‌ హీరో ధనుష్‌ కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం ‘రాయన్‌’. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు. కళానిధి మారన్‌ నిర్మించారు. ఇందులో సందీప్‌ కిషన్, కాళిదాస్‌ జయరామ్, అపర్ణ బాలమురళి, దుషారా విజయన్‌, వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రకాశ్‌ రాజ్‌, ఎస్‌జె సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్‌ రాయన్‌పై భారీ అంచనాలను పెంచాయి. నేడు రాయన్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే చాలా షాట్ల రాయన్ ప్రీమియర్స్ పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. రాయన్‌కు మంచి రివ్యూస్ వస్తున్నాయి. హీరో ధనుష్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. యాక్టింగ్, డైరెక్షన్ ఇరగదీశాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ‘రాయన్ రా, ఇంటెన్స్, హింసతో కూడిన చిత్రం. ఇలాంటి సినిమాకు దర్శకత్వం వహించే నైపుణ్యం ధనుష్‌కు ఉందని అనుకోలేదు. 90 దశకంలోని ఏఆర్ రెహ్మాన్ మళ్లీ వచ్చాడు. సెకండ్ హీరో రెహ్మన్. ధనుష్ యాక్టింగ్ సూపర్. ప్రతీ నటుడికి స్క్రీన్ టైమ్ ఉంది. వెట్రీమారన్ మూవీ లాగా ఉంటుంది. ఫస్టాఫ్ టాప్ లెవెల్‌’ అని నెటిజన్ కామెంట్ చేశాడు.

Also Read: Janhvi Kapoor-NTR: నాకు 10 రోజులు పడితే.. ఎన్టీఆర్‌కు సింగిల్ సెకనే: జాన్వీ కపూర్‌

‘ధనుష్ నిజంగా ప్రతిభావంతుడైన వ్యక్తి. అతని దర్శకత్వ నైపుణ్యం సినిమాను తదుపరి స్థాయికి తీసుకువెళతాయని ఆశిస్తున్నాను. రాయన్‌కి శుభాకాంక్షలు’ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ‘రాయన్‌ మొదటి భాగం సాలిడ్ ప్యాక్డ్ కంటెంట్. దర్శకుడు ధనుష్ ఎలా తీశారో అని ఆశ్చర్యంగా ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంది’, ‘మొదటి భాగం సూపర్, రెండో భాగం మహాద్భుతం. తప్పక చూడాల్సిన సినిమా’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ చూస్తే దర్శకుడిగా, నటుడిగా ధనుష్ హిట్ కొట్టినట్లే.

Show comments