Site icon NTV Telugu

DGP Ravi Gupta : తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసాం…

Dgp Ravi Gupta

Dgp Ravi Gupta

తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు డీజీపీ రవి గుప్తా. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కు ను వినిగించుకోవాలని సూచించారు. ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, లోక్‌సభ 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసామని ఆయన పేర్కొన్నారు. 500 తెలంగాణ స్పెషల్‌ ఫోర్స్‌ విభాగాలు సహా.. 164 సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌తో భద్రతా ఏర్పాట్లు చేసామని ఆయన వెల్లడించారు. 7వేల మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులతో బందోబస్తు చేసామని, 89 ఇంటర్‌ స్టేట్‌ బోర్డర్‌ చెక్‌పోస్టులు, 173 అంతర్‌జిల్లా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసామన రవి గుప్తా తెలిపారు.

రూ.186కోట్ల విలువచేసే మద్యం, డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నామని, తనిఖీలకు సంబంధించి 8,863 కేసులు నమోదు చేసామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో కేంద్ర బలాలతో భద్రత ఏర్పాటు చేసామని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియా కోసం ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేశామని, రాష్ట్ర సరిహద్దుల్లో పారామెలిటీ బలగాలతో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు డీజీపీ రవిగుప్తా.

Exit mobile version