ఏపీలో పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వరుస రివ్యూలు చేపడుతున్నారు. పోలింగ్ జరిగిన మే 13 నుంచి ఇవాళ్టి వరకు పల్నాడు, తిరుపతి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన వరుస రివ్యూలు చేపడుతున్నారు. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏపీలో అనేక చోట్ల నెలకొన్నాయి.
Also read: MLA House Arrest: కొనసాగుతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్..
గత రెండు రోజులుగా అన్ని జిల్లాల ఎస్పీలతో డీజీపీ టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు. హింసాత్మక ఘటనలు జరుగుతున్న సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు బలగాల మోహరింపుకు డీజీపీ ఆదేశాలు జారీ చేసారు. దాడులకు కారణమవుతున్న ప్రధాన నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసారు.
Also read: Kalki 2898 AD : ప్రభాస్ “కల్కి” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?
దాడులు నిలువరించేలా ముందస్తు చర్యలు, దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయటం అరెస్టు లు వెంటనే చేయాలని ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు చేస్తూ వరుస రివ్యూలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రోజుకి రెండు నుంచి మూడు సార్లు టెలీ కాన్ఫరెన్స్ లతో రాష్ట్రంలోని పరిస్థితులను సమీక్షిస్తున్నారు డీజీపీ.