NTV Telugu Site icon

DGP Dwaraka Tirumala Rao: మదనపల్లె సబ్ కలెక్టరేట్‌ ఘటనపై డీజీపీ కీలక వ్యాఖ్యలు.. కుట్ర కోణం..!

Ap Dgp

Ap Dgp

DGP Dwaraka Tirumala Rao: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తోంది.. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు.. మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో జరిగిన ఘటన యాక్సిడెంట్‌ కాదని, ఇన్సిడెంట్‌గా అనిపిస్తోందన్నారు ఏపీ డీజీపీ.. రికార్డుల రూంలో అగ్నిప్రమాదం వెనుక కుట్రకోణం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్‌ కార్యాలయంలో దాదాపు మూడు గంటలకు విచారణ చేపట్టారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గత రాత్రి సుమారు 11.30 గంటలకు మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. 3 గంటల పాటు పరిశీలించిన తర్వాత అది యాక్సిడెంట్‌ కాదు.. ఇన్సిడెంట్‌గా భావిస్తున్నాం అన్నారు.

Read Also: Vijay: త్రిష, రంభలతో విజయ్.. అసలు మ్యాటర్ ఇదా?

22ఏ భూముల రికార్డులున్న గదిలో ఫైర్‌ ఇన్సిడెంట్‌ జరిగింది.. కీలక దస్త్రాలున్న విభాగంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ఘటన సమాచారం ఆర్డీవోకు తెలిసింది.. కానీ, కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదు. ఘటన విషయం తెలుసుకున్న సీఐ కూడా ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల అలసత్వం కనిపిస్తోందని.. వారిపై వేటు తప్పదన్నారు. కార్యాలయంలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగేందుకు అవకాశమే లేదని విచారణలో తేలిందని.. ఇక్కడ వోల్టేజ్ తేడాలు లేవని అధికారులు చెబుతున్నారు. పరిస్థతి బట్టి కేసును సీఐడీకి బదిలీ చేస్తామని.. ప్రస్తుతం పది ప్రత్యేక టీమ్‌లను దర్యాప్తు కోసం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ కేసులో ఎవరు ఉన్నా విడిచిపెట్టం.. అంతా బయటకు తీస్తాం.. ఎవరున్నా వదలం అని హెచ్చరించారు డీజీపీ ద్వారకా తిరుమల రావు.

Show comments