Site icon NTV Telugu

DGCA New Rules: ఇకపై విమానంలో ‘వీరంగాలు’ చెల్లవ్.. బాసు కొత్త రూల్స్ తెలుసా!

Dgca New Rules

Dgca New Rules

DGCA New Rules: విమానంలో ప్రయాణించేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా లేదంటే తోటి వారి భద్రతకు ముప్పు తెచ్చే ప్రవర్తనను “వికృత ప్రవర్తన” గా పరిగణిస్తూ DGCA ఆరు కొత్త రకాల తప్పులను రూల్స్‌ బుక్‌లోకి ఎక్కించింది. పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ జారీ చేసిన కొత్త ఉత్తర్వులో ఏం చెప్పారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Jonathan Trott: “ప్లేయర్స్ బాగా ఎదిగారు”.. అఫ్గాన్ టీమ్‌తో విడిపోతూ కన్నీళ్లు పెట్టుకున్న కోచ్..

ఆ ఆరు తప్పులు ఇవే..
* విమానంలో సిగరెట్ లేదా ఈ-సిగరెట్ తాగడం.
* అనుమతి లేని చోట లేదా పరిమితికి మించి మద్యం తాగడం.
* ఎమర్జెన్సీ డోర్స్‌ను అనవసరంగా తెరవడం లేదా లైఫ్ జాకెట్లను అనధికారికంగా వాడటం.
* విమానంలో నినాదాలు చేయడం లేదా ఆందోళనలు చేపట్టడం.
* మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల వల్ల ఇతరులను ఇబ్బంది పెట్టడం.
* గట్టిగా అరవడం, తోటి ప్రయాణీకులను ఇబ్బంది పెట్టడం, ముందున్న సీట్లను లేదా టేబుళ్లను తన్నడం వంటి పనులు.

వీటికి శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా?
ఎవరైనా ఇలాంటి పనులు చేస్తూ దొరికిపోతే, విమానయాన సంస్థలు వారిని 30 రోజుల పాటు విమానం ఎక్కకుండా నేరుగా నిషేధించవచ్చు. దీని కోసం ఎలాంటి కమిటీ విచారణ అవసరం లేదు. విమాన భద్రతకు హాని కలిగిస్తే అది నేరంగా పరిగణించి, నిందితులపై చట్టపరమైన శిక్షలు కూడా తీసుకోవచ్చు. ప్రయాణీకుడు సిబ్బంది మాట వినకుండా వికృతంగా ప్రవర్తిస్తుంటే, పైలట్ వెంటనే ఆ విషయాన్ని సంబంధిత విభాగానికి తెలియజేస్తారు. విమానాన్ని దారి మళ్లించి, దగ్గరలోని విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తారు. విమానం ల్యాండ్ అవ్వగానే అక్కడి భద్రతా సిబ్బంది ఆ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకుని తగిన చర్యలు చేపడతారు. నిజానికి విమాన ప్రయాణం అనేది అందరి భద్రతతో కూడుకున్నది. ఒక్క ప్రయాణీకుడి తప్పు వల్ల విమానంలోని వందలాది మంది ప్రాణాలకు ముప్పు కలగవచ్చు, అందుకే DGCA ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: The Hundred 2026: పాకిస్థాన్ ప్లేయర్లను బహిష్కరించిన ఆ 4 మేజర్ టీమ్స్!

Exit mobile version