Gollalamamidada: సూక్ష్మ కళాకారుడి భక్తి .. 1,01,001 బియ్యపు గింజలపై ‘రామ’ నామం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gollalamamidada: ఆంధ్ర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన గొల్లలమామిడాడ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దివ్య కళ్యాణ మహోత్సవములకు 16వ పర్యాయం రామనామ లిఖిత తలంబ్రాలను కళ్యాణ కొబ్బరిబొండాలను సిద్ధం చేశారు. లక్ష వెయ్యి ఒకటి (101001) బియ్యపు గింజలపై రామ నామాన్ని ఎటువంటి సూక్ష్మ పరికరము లేకుండా మార్కరు పెన్ను సహాయముతో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో లిఖించి సిద్ధం చేశారు. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లలమామిడాడ గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వ్యాయామ దర్శకులు లయన్ ద్వారంపూడి యువ రాజారెడ్డి వీటిని తయారు చేశారు.
Rayavaram Bus Tragedy: రాయవరం బస్సు ప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేబినెట్..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ప్రతి సంవత్సరం పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున రామనామ లిఖిత యజ్ఞాన్ని ముక్కోటి ఏకాదశి పర్వదినము రోజు నుండి ప్రారంభించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం అనంతరం బియ్యపు గింజలపై రామ అనే మంత్రాన్ని రాయడం జరుగుతుందని యువ రాజారెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం 16వ సారి నిర్విఘ్నముగా ఈ మహా యజ్ఞం జరిగిందని అన్నారు. శ్రీరామనవమి రోజున రాముని కృపతో ఒక లక్ష వెయ్యి ఒక్కటి (101001) బియ్యపు గింజలపై రామా అనే నామాన్ని రాయడం జరిగిందని వివరించారు.

ఈ పవిత్రమైన రామనామ లికిత ఒక లక్ష వెయ్యి ఒక్కటి (101001) తలంబ్రాలను గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవం లో తలంబ్రాలుగా సమర్పించుట ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సదావకాశాన్ని రాముడు కల్పించినట్లు యువ రాజారెడ్డి తెలిపారు. అలాగే రాముని కళ్యాణంలో వినియోగించే కళ్యాణ కొబ్బరి బొండములను సంధ్య డెకరేషన్స్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సహకారంతో సర్వాంగ సుందరముగా శంకు చక్ర నామ సహితముగా సిద్ధం చేసి పెళ్ళికొడుకు రామయ్య, పెండ్లి కుమార్తె సీతమ్మ నామాలను లిఖించి కళ్యాణంలో ఆలయ ధర్మకర్త ద్వారంపూడి రామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి దంపతుల సమక్షంలో యువ రాజారెడ్డి సంధ్య దంపతుల కుటుంబ సభ్యులు ఆలయ అర్చకులకు అందజేయడం జరుగుతుంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!