NTV Telugu Site icon

Gujarat: భక్తితో వెళ్లాడు.. భగవంతుడి కింద అడ్డంగా ఇరుక్కున్నాడు

Devotee

Devotee

Gujarat: బాధలు తొలగించాలని దేవుడిని వేడుకునేందుకు గుడికెళ్తే.. దేవుడే తనపై మోయలేని భారం మోపడంతో భక్తుడు చిక్కుల్లో పడ్డాడు. దీంతో కాసేపు ఆ భక్తుడు ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. చూసిన వాళ్లంతా పగోడికూడా ఇలాంటి కష్టం రాకూడదని బాధపడ్డారు. గుజరాత్‌లో ఓ భక్తుడు ఆలయానికి వెళ్లాడు. ఆ గుడిలో ఏ ఏనుగు విగ్రహం ఉంది. అక్కడ ఓ ఆచారం ఉంది. పూజా కార్యక్రమాల్లో భాగంగా ఆ ఏనుగు విగ్రహం కింద నుంచి పడుకుని.. బయటకు రావాలి. అలా వస్తే వారికి మంచిదని నమ్ముతారు. ఆ వ్యక్తి కూడా అలాగే చేశాడు. ఏనుగు విగ్రహం కిందకు వెళ్లాడు. కానీ అనుకోని విధంగా అక్కడ ఇరుక్కుపోయాడు. అందులోనుంచి రాలేక నానా అవస్థలు పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Read Also: Gujarat Elections : చేతుల్లేకున్నా.. బాధ్యతగా కాళ్లతో ఓటేశాడు

ఆ వీడియోలో ఆ వ్యక్తి విగ్రహం కింద ఇరుక్కుని.. బయటపడలేక ఇబ్బంది పడుతుండడం చూడొచ్చు. ఆ సమయంలో చాలామంది బయటకు తీసుకురావడానికి పలు సలహాలు, సూచనలు కూడా చేస్తుండడం కనిపిస్తుంది. అయితే ఆ వీడియోలో అతడు బయటకు వచ్చింది లేదు. కాగా గతంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 2019లో ఓ మహిళ ఆ ఏనుగు విగ్రహం కింద ఇరుక్కుపోయింది. తోటి భక్తులు ఆమెను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు. అలా ప్రయత్నించిన చాలాసేపటి తర్వాత ఆ మహిళా భక్తురాలు బయటపడింది.