NZ vs PAK: న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్‌కు కరోనా పాజిటివ్.. ఇది రెండో కేసు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devon Conway Tested Positive for Coronavirus: న్యూజిలాండ్ క్రికెట్‌లో కరోనా వైరస్ మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ కరోనా బారిన పడగా.. తాజాగా స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వేకు వైరస్ సోకింది. ప్రస్తుతం కాన్వే ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడిని క్లోస్ కాంటాక్ట్ అయిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని న్యూజిలాండ్ బోర్డు హెచ్చరించింది. కరోనా పాజిటివ్ రావడంతో పాకిస్థాన్‌తో జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు కాన్వే దూరమయ్యాడు. అతడి స్థానంలో చాడ్ బోవెస్‌ను కివీస్ బోర్డు ఎంపిక చేసింది.
‘డెవాన్ కాన్వేకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈరోజు పాకిస్తాన్‌తో జరిగే నాలుగో టీ20 మ్యాచ్ నుంచి కాన్వే తప్పుకున్నాడు. గురువారం పాజిటివ్‌గా తేలడంతో కాన్వే క్రైస్ట్‌చర్చ్ హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉన్నాడు. కాంటర్‌బరీ కింగ్స్ బ్యాట్స్‌మెన్ చాడ్ బోవ్స్ ఈ రోజు జట్టులో చేరనున్నాడు’ అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. బౌలింగ్ కోచ్ ఆండ్రే ఆడమ్ కూడా కరోనా బారిన పడ్డాడని న్యూజిలాండ్ బోర్డు తెలిపింది. అతడి స్థానంలో బ్రెండన్ డంకెర్స్ జట్టుతో కలుస్తాడని పేర్కొంది.
Also Read
- YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
- YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- Botsa Satyanarayana: లోకేష్ రాజీనామా చేయాలి.. రాబోయే అసెంబ్లీ సమావేశాలపై బొత్స కీలక వ్యాఖ్యలు
Also Read: Sachin Tendulkar Batting: సచిన్ హిట్టింగ్.. 16 బంతుల్లో 27 పరుగులు! వీడియో వైరల్
స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ అదరగొడుతోంది. ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచుల్లో గెలిచిన కివీస్.. 3-0తో ట్రోఫీ సొంతం చేసుకుంది. కివీస్ జోరు చూస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేసేలా ఉంది. శుక్రవారం క్రిస్ట్‌చర్చ్‌లోని హగ్లే ఓవల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఇదే వేదికపై 21న ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లతో అయినా పాకిస్థాన్ కెప్టెన్ షాహీన్ ఆఫ్రిది బోణీ కొడతాడేమో చూడాలి.
తాజావార్తలు
-
YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Yash – Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
-
YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ట్రెండింగ్
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!