NTV Telugu Site icon

Deviyani Sharma : సేవ్ ద యూత్.. బికినీలో దేవయాని శర్మ బీభత్సం

New Project (58)

New Project (58)

Deviyani Sharma : పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ చిత్రంలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించింది దేవయాని శర్మ. ఈ సినిమాతో దేవయాని శర్మకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో కాస్త బోల్డ్ పాత్రలో తళుక్కుమంది. 2023లో వచ్చిన సేవ్ ది టైగర్స్ సిరీస్‌లో కూడా ఆమె చాలా హోమ్లీగా కనిపించింది. ఈ సిరీస్‌కి మంచి క్రేజ్ రావడంతో దేవయానికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. అదే ఏడాది సైతాన్ సిరీస్‌లో బోల్డ్ క్యారెక్టర్లో కనిపించి అందరినీ తన వైపుకు తిప్పుకుంది. సైతాన్ సిరీస్‌లో దేవయాని నటన అందరినీ ఔరా అనిపించింది. దేవయాని శర్మ మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. కెరీర్ స్టార్టింగ్‌లో బాలీవుడ్‌లో ఓ సినిమా చేసింది. అక్కడ లవ్ శుదా సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసింది. ఆ తర్వాత టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. రొమాంటిక్ చిత్రాలతో పాటు, ఆమె అనగనగా, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ సిరీస్‌లను కూడా చేసింది. మెల్లగా అవకాశాలు అందుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న దేవయాని శర్మ సోషల్ మీడియాలో మాత్రం ఓ అందాల ఆటమ్ బాంబ్ అనే చెప్పాలి. ఈ అమ్మడు ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. దేవయాని శర్మ తన అందంతో కుర్రాళ్ల గుండెల్లోకి బాణాలు ఎక్కిస్తోంది.

Read Also:Parliament: పార్లమెంట్‌లో ఏం జరగబోతోంది..? ఎంపీలకు ‘‘ త్రీ లైన్ విప్’’ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్..

తాజాగా దేవియాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన బికినీ ఫోటోలు వైరల్‌గా మారాయి. సముద్ర అందాల మధ్య ఆమె ఆకర్షణీయమైన లుక్ అభిమానులను చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఉబికి వస్తున్న అందాలను ప్రదర్శిస్తూ హైలెట్ చేసింది. ప్రస్తుతం దేవియాని కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టి బిజీగా కొనసాగుతోంది. “లైఫ్ స్టోరీస్” అనే కొత్త వెబ్ సిరీస్‌లో ఆమె కీలక పాత్రలో నటించనుంది. దేవియాని సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిత్వం, గ్లామర్‌ను హైలెట్ చేస్తూ, నెటిజన్లను ఆకర్షిస్తోంది. తాజా ఫోటోషూట్‌లో ఆమె కేవలం సౌందర్యమే కాకుండా, బోల్డ్ లుక్స్ తో కూడా ఆకట్టుకుంది. ప్రకృతి మధ్య ఆమె క్లాసీ లుక్ ప్రతి ఒక్కరినీ ఆకర్షించే విధంగా ఉంది. టు హాట్ అంటూ నెటిజన్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు.

Read Also:CM Chandrababu: ఎడ్యుకేషన్, స్కిల్స్, ఉద్యోగాలు ఒక విజన్‌తో జరగాలి..

Show comments