జగన్ రెడ్డి కనుసన్నల్లో అయినవారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి అడ్డగోలుగా లిస్ట్ తయారు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్ వేశారన్నారు. జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా ఉన్నాయన్నారు. అర్హత ఉన్నవారికి తెలియకుండా నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. అడ్డగోలు నియామకాలను అడ్డుకోవాలని సీఈసీని, సంబంధిత అధికారులను చంద్రబాబు కోరారినట్లు తెలిపారు. భోగాపురంలో రిజల్ట్ కు ముందే పేదల భూములు కొట్టేసేందుకు ప్లాన్ వేశారని ఆరోపించారు.
READ MORE: Annamalai: మాజీ సీఎం జయలలితపై సంచలన వ్యాఖ్యలు చేసిన అన్నామలై.. ఏమన్నారంటే..
కాగా.. ఈ అంశంపై టీడీపీ నేత శుక్రవారం యూపీఎస్పీ ఛైర్మన్ కు లేఖ రాశారు. రాష్ట్ర కేడర్ అధికారులను ఐఏఎస్ లుగా ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపడం నిబంధనలకు విరుద్ధమని ఆయన లేఖలో పేర్కొన్నారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ఉన్నందు వల్ల ఐఏఎస్‌ల కన్ఫర్మేషన్ ప్రక్రియ చేపట్టడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మొండితనంతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే అవుతుందని లేఖలో పేర్కొన్నారు. జాబితా కూడా నిబంధనల ప్రకారం రూపొందించలేదని లేఖలో ప్రస్తావించారు. ఈ పదోన్నతుల జాబితాలో ఉన్నవారు కూడా కేవలం సీఎంఓలో ఉన్నవారే మాత్రమే అని గుర్తు చేశారు. తాజాగా ఈ నియామకాలపై మరోసారి టీడీపీ నేత, మాజీ మంత్రి ఉమా ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిశాకే పదవులు ఇవ్వాలని వ్యాఖ్యానించారు.