Site icon NTV Telugu

Devineni Avinash: అందరి గుండెల్లో నెహ్రూ బ్రతికే ఉన్నారు.. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తాం!

Devineni Nehru Death Anniversary

Devineni Nehru Death Anniversary

మాజీమంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ వద్ద ఆయన తనయుడు, విజయవాడ వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ తలశీల రఘురాం, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్, ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్లు, పలువురు నేతలు దేవినేని నెహ్రూ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మట్లాడుతూ.. దేవినేని నెహ్రూ చనిపోయి ఎనిమిది సంవత్సరాలు అయినా అందరి గుండెల్లో ఆయన బ్రతికే ఉన్నారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచిన వారు ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు.

‘దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా వైసీపీ శ్రేణులు, నెహ్రూ అభిమానులతో కలిసి నివాళులు అర్పించాను. విజయవాడ నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు వర్ధంతి సందర్భంగా సేవ కార్యక్రమాలు చేసి ఘన నివాళులు అర్పిస్తున్నారు. చనిపోయి ఎనిమిది సంవత్సరాలు అయినా.. అందరి గుండెల్లో నెహ్రూ బ్రతికే ఉన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ప్రజలకు సేవ చేశారు. ఆయన అడుగుజాడల్లో నడిచిన వారు ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగారు. వైసీపీ హయాంలో రిటైనింగ్ వాల్ నిర్మించి కరకట్ట ప్రజలకు అండగా నిలిచాం. వాల్ నిర్మాణానికి వైఎస్ జగన్ గారు చిత్తశుద్ధితో కృషి చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తాం’ అని దేవినేని అవినాష్ అన్నారు.

‘విద్యార్థి నాయకుడుగా రాజకీయం ప్రారంభించి తిరుగులేని శక్తిగా నెహ్రూ ఎదిగారు. ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టారు. నెహ్రూది, వైఎస్ఆర్ గారిది రాజకీయాలలో ఒకటే నడవడిక. నమ్మిన వారి కోసం ఎక్కడ వరకు అయినా వెళ్తారు. వారి ఆశయ సాధనకు కృషి చేస్తాం. దేవినేని అవినాష్ కూడా రాజకీయాలలో నెహ్రూ అంత ఎత్తు ఎదగాలని కోరుకుంటున్నా’ అని వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం పేర్కొన్నారు.

Exit mobile version