Site icon NTV Telugu

RC17 : చరణ్ – సుకుమార్ సినిమా నుండి దేవిశ్రీ అవుట్.. రంగంలోకి ధురంధర్ సెన్సేషన్?

Rc 17

Rc 17

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం ‘RC17’పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో.. ఎలాంటి అప్డేట్ వచ్చిన సరే సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఈ నేపథ్యంలో.. ఆర్సీ 17 మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఒక పెద్ద మార్పు జరగబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. సాధారణంగా సుకుమార్ సినిమాలకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉంటారు. ఆర్య నుంచి పుష్ప 2 వరకు దేవితోనే కలిసి పని చేశాడు సుక్కు.

Also Read : Tollywood : పెద్ది vs లెనిన్.. విడుదల తేదీల గందరగోళం.. అఖిల్ పరిస్థితేంటి?

కానీ, ఆర్సీ 17 నుంచి డీఎస్పీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. కారణాలు ఏమైనా.. ఈసారి ధురంధర్ మ్యూజికల్ సెన్సేషన్‌ను రంగంలోకి దింపాలని భావిస్తున్నాడట సుకుమార్. ఇటీవల బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ సినిమాకు అద్భుతమైన అల్బమ్‌తో పాటు.. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి.. గ్లోబల్ లెవెల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్ పేరు ప్రస్తుతం పరిశీలనలో ఉందని తెలుస్తోంది. నిజానికి, శాశ్వత్ సచ్‌దేవ్ తన విలక్షణమైన శైలితో సంగీత ప్రపంచంలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు.“ఉరి: ద సర్జికల్ స్ట్రైక్” వంటి చిత్రాలతోనే సత్తా చాటిన ఆయన, ‘ధురంధర్’తో గ్లోబల్ లెవల్ ఇంపాక్ట్ చూపించారు. ఇప్పుడు ఆర్సీ 17 లాంటి ప్రాజెక్ట్‌కు శాశ్వత్ తోడైతే మామూలుగా ఉండదని, ఇటు ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి.

Exit mobile version