Tollywood : పెద్ది vs లెనిన్.. విడుదల తేదీల గందరగోళం.. అఖిల్ పరిస్థితేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విడుదల తేదీల లెక్కలు మారుతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం వాయిదా పడటంతో ఇతర సినిమాల షెడ్యూల్స్‌పై ఆ ప్రభావం గట్టిగా పడుతోంది. ముఖ్యంగా యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న‘లెనిన్‘చిత్ర యూనిట్ ఇప్పుడు డైలమాలో పడినట్లు తెలుస్తోంది.
Also Read : SKN : పెద్ది రిలీజ్ డేట్ కాంట్రవర్సల్ కామెంట్స్ పై SKN వివరణ
Also Read
నిజానికి ‘లెనిన్’ సినిమాను మే 1వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం ముందుగా భావించింది. అయితే ఏప్రిల్ 30న రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల కాబోతుండటంతో, ఆ భారీ చిత్రంతో పోటీ ఎందుకని ‘లెనిన్’ మేకర్స్ తమ సినిమాను జూన్ 26కు వాయిదా వేశారు. ఒక పెద్ద సినిమాతో క్లాష్ లేకుండా సేఫ్ డేట్ కోసం వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పుడు రామ్ చరణ్ ‘పెద్ది’ కూడా వాయిదా పడి జూన్ 25వ తేదీనే విడుదలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ‘లెనిన్’ టీమ్ ఏ పోటీని వద్దనుకుని వెనక్కి తగ్గిందో, ఇప్పుడు అదే సినిమాతో మళ్లీ తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలో ఈ రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామంతో ‘లెనిన్’ టీమ్ పునరాలోచనలో పడింది. ‘పెద్ది’ వంటి పాన్ ఇండియా సినిమాతో పోటీ పడటం రిస్క్ అని భావిస్తే, సినిమాను మరికొంత కాలం వాయిదా వేస్తారా? లేదా అంతకంటే ముందే అంటే ‘ప్రిపోన్’ చేసి ప్రేక్షకు ముందుకు తీసుకువస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై లెనిన్ నిర్మాతల నుండి త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
తాజావార్తలు
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!