Devara: ‘దేవర’ సినిమా పై నెట్టింట చర్చ.. ఎవరెవరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా దేవర.. నిన్న థియేటర్లలోకి వచ్చిన సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్న మొదటి షోతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న దేవర సినిమా, సాయంకాలానికి యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానులు కాస్త నిరాశకు లోనయ్యారు. టాక్ ఎలా ఉన్నా దేవర సినిమా రిలీజ్ కి ముందే అమెరికాలో రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అక్కడ రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టిందని విశ్లేషకులు అంటున్న మాట. నిన్న ఈరోజు వీకెండ్ కావడంతో ఆయా వసూళ్లు మరింత పెరిగిపోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక అన్నిటికంటే శుభవార్త ఏమిటంటే, దేవర సినిమా మొదటి రోజే 172 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టింది.
Read Also:IPL 2025 Retention: ఐపీఎల్ 2025 మెగా వేలం.. రిటెన్షన్ లిస్ట్ డెడ్‌లైన్ డేట్ ఇదే!
Also Read
- Ashwin: 'వైభవ్ నీళ్లు మోయడం అవమానం కాదు'.. విమర్శకులకు అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్!
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- Akhil Raj Incident: నాదే తప్పు.. హీరోను ఏం అనకండి.. డెలివరీ బాయ్ షాకింగ్ స్టేట్మెంట్..
దీంతో అసలు దేవర సినిమా బడ్జెట్ ఎంత.. ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకున్నారు.. అనే అంశాలపై నెట్టింట్లో తెగ చర్చ సాగుతోంది. అయితే, ‘దేవర’ సినిమాను దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అందులో 26 శాతం నటీనటుల రెమ్యునరేషన్‌కే కేటాయించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఏకంగా రూ.60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. జాన్వీ కపూర్ రూ.5 కోట్లు, సైఫ్ అలీ ఖాన్ రూ.10 కోట్లు, ప్రకాష్ రాజ్ రూ.1.5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా క్యాస్టింగ్ కూడా వారి పారితోషకం పెంచి తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కాబట్టే, ఔట్‌పుట్ కూడా పర్ఫెక్ట్‌గా వచ్చిందని.. అందుకే తొలిరోజే ఈ సినిమా రూ.172 కోట్లు వసూళ్లు రాబట్టిందని అభిమానులు అంటున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో ఈ సినిమా 1000కోట్ల క్లబ్ లో చేరనుందని ఎన్టీఆర్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
Read Also:Eye Twitching: పదే పదే కళ్లు కొట్టుకుంటున్నాయా.? మీలో ఈ సమస్యలు ఉన్నట్లే.!
తాజావార్తలు
-
Ashwin: ‘వైభవ్ నీళ్లు మోయడం అవమానం కాదు’.. విమర్శకులకు అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
-
OG 2 Heroine: ‘ఓజీ 2’ హీరోయిన్.. ఇదెక్కడి రచ్చ మామ!
-
Peddi OTT: ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ వాయిదా? కొత్త స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!
-
Gold & Silver Prices Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన గోల్డ్ ధరలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!