NTV Telugu Site icon

Devara Release Trailer: ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.. ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి మరో ట్రైలర్

Devara

Devara

Devara Release Trailer: ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్‌ 27న పాన్‌ ఇండియా లెవెల్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. మూవీ అనౌన్స్‌ చేసిన దగ్గర నుంచి అదే హైప్ కొనసాగుతూ వస్తోంది. ఎప్పుడు ఎలాంటి అప్‌డేట్ వస్తుందా అని అభిమానులంతా దేవరపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఇప్పటికే దేవర్ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ట్రైలరే సినిమాపై అంచనాలను నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కోసం మరో ట్రీట్‌ ఇవ్వనున్నట్లు లేటెస్ట్ న్యూస్ బయటికొచ్చింది. రిలీజ్‌ లోపే మరో ఇంట్రెస్టింగ్ ట్రైలర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు న్యూస్ బయటకొచ్చింది.

Read Also: Bigg Boss 8 Telugu: మూడోవారంలో డేంజర్‌ జోన్‌లో ఉన్నది వీరిద్దరే..!

దేవర సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను సెప్టెంబర్‌ 22(రేపు)న మేకర్స్ భారీ ఎత్తున ప్లాన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలోనే ”దేవర రిలీజ్‌ ట్రైలర్‌”ను మేకర్స్ విడుదల చేయనున్నారు. రిలీజ్‌ ట్రైలర్‌ను విడుదల చేయడానికి చిత్రబందం ఇప్పటికే ప్లాన్ చేసిందని తెలిసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కు మాస్ ట్రీట్ ఇవ్వనున్నారట. ఈ క్రేజీ న్యూస్‌తో ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మరి ప్రేక్షకులను ఈ ట్రైలర్ ఎలా మెప్పిస్తుందో చూడాలి. కాగా ‘దేవర’ రిలీజ్‌ ట్రైలర్‌ కోసం ఎక్సయిటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్‌ 22న హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

Show comments