యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.ఆ సినిమా తో ఎన్టీఆర్ క్రేజ్ బాగా పెరిగింది.తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ విదేశాలలో కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు.ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా పై అభిమానులలో భారీ అంచనాలు వున్నాయి.గతంలో దర్శకుడు కొరటాల మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమాను తెరకెక్కించాడు. ఆచార్య సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.దీనితో కొరటాల ఎన్టీఆర్ తో తెరకెక్కించబోయే దేవర సినిమాకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సారి ఎలాంటి మిస్టేక్ జరుగకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పటికే దేవర సినిమా నుంచి విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ భామ దేవర సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం కాబోతుంది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు కొరటాల పక్కా యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో కొన్ని సీన్స్ యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించబోతున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతుంది.ఈ సినిమా లో ఎన్టీఆర్ కు అత్తగా విలక్షణ నటి రమ్యకృష్ణ నటించనున్నారని సమాచారం.. గతంలో నా అల్లుడు సినిమాలో రమ్య కృష్ణ ఎన్టీఆర్ కు అత్తగా నటించారు. ఇప్పుడు మరోసారి ఆమె ఎన్టీఆర్ కు అత్త పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. జాన్వీ కపూర్ అమ్మపాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతున్నట్లు సమాచారం.ఈ సినిమాలో రమ్య కృష్ణ మధ్య వచ్చేసీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.మరి ఈ వార్త పై త్వరలో అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.