NTV Telugu Site icon

Penukonda MLA: ఎమ్మెల్యే శంకరనారాయణ కాన్వాయ్‌పై డిటోనేటర్‌తో దాడి

Penukonda Mla

Penukonda Mla

Penukonda MLA: పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణకు ప్రమాదం తప్పింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్లలో బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యేపై ఓ ఆగంతకుడు డిటోనేటర్‌ విసిరాడు. గోరంట్ల మండలం గడ్డం తండా వద్ద ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకరనారాయణ నిర్వహించారు. ఆయన వాహనం దిగి కొంత దూరం నడిచారు. బైక్ ర్యాలీ అనంతరం వెళుతున్న ఎమ్మెల్యే శంకరనారాయణ కాన్వాయ్‌పై ఓ ఆకతాయి డిటోనేటర్‌ విసరడం కలకలం రేపింది. అది పేలక పోవడంతో ప్రమాదం తప్పింది. అయితే, డిటోనేటర్‌ గురితప్పి పొదల్లో పడటం, అది పేలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అక్కడున నాయకులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.

Also Read: World Cup 2023: సచిన్‌ రికార్డు బద్దలు.. ప్రపంచకప్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా డేవిడ్‌ వార్నర్‌!

శంకర్ నారాయణ కాన్వాయ్‌పై దాడి చేసిన వ్యక్తి ఎవరన్నది పోలీసులు గుర్తించారు. నిందితుడు సోమందేపల్లి మండలం గుడిపల్లికి చెందిన వెంకటేష్‌గా గుర్తించారు. వెంకటేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. గ్రానైట్ తవ్వకాల్లో భాగంగా పేలుళ్లకు ఉపయోగించే డిటోనేటర్‌ను ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. మద్యం మత్తులోనే ఇలా చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు తెలుసుకున్నారు. ఇవాళ మద్యం మత్తులో పనికి వెళ్లగా యజమాని వెనక్కి పంపించినట్లు వారు వెల్లడించారు. జేబులో ఎలక్ట్రికల్ డిటోనేటర్ తీసుకువచ్చి.. వాహనంపై వెంకటేష్ విసిరేశాడు. ఎలక్ట్రికల్ డిటోనేటర్‌కు కరెంటు లేకుండా పేలే అవకాశం లేదని పోలీసులు తెలిపారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని పోలీసులు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని సీఐ చెప్పారు.