NTV Telugu Site icon

Deshapathi Srinvias : బడ్జెట్‌లో ఎక్కువగా గత ప్రభుత్వాన్ని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు

Deshapathi Srinivas

Deshapathi Srinivas

బడ్జెట్ లో ఎక్కువగా గత ప్రభుత్వాన్ని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండలిలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చట్టబద్దత కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ పదే పదే చెప్పారని, చట్టబద్దత అనే హామీ ఊసే మర్చిపోయారన్నారు దేశపతి శ్రీనివాస్. అభయహస్తం హామీలు 13 ఉన్నాయి బడ్జెట్ లో వీటికి చోటేది..? అని ఆయన ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.2,500 ఉంది ఇస్తామన్నారు దానిగురించి ప్రతిపాదనే లేదని, ఎన్నికల ముందు రూ.500 కి గ్యాస్ అన్నారు అధికారంలోకి వచ్చాక షరతులు వర్తిస్తాయి అంటున్నారన్నారు దేశపతి శ్రీనివాస్.

Viral Video: క్లాస్‌రూమ్‌లో టీచర్ స్లీపింగ్.. విసనకర్రతో విసురుతూ నిద్ర బుచ్చిన చిన్నారులు

చేయూత పథకం ద్వారా రూ.4 వేలు ఇస్తామన్నారు వాటి గురించి ప్రస్తావన లేదని, రైతులకు రైతు భరోసా ఇప్పటికి అందలేదన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో పంటలకు బోనస్ రూ.500 ఇస్తామన్నారు కానీ ఇప్పుడు సన్నాలకు మాత్రమే అంటున్నారని, తెలంగాణ లో 90 శాతం పండించేది దొడ్డు వడ్లు అవి పండించే వాళ్లకు ద్రోహం చేయవద్దన్నారు దేశపతి శ్రీనివాస్. ప్రజాపాలన అని పదే పదే చెబుతున్నారని, పోలీసులు లైబ్రరీలో చొరబడి విద్యార్థుల మీద లాటిచార్జ్ చేస్తున్నారన్నారు. అంగన్ వాడి, ఆశా వర్కర్లు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. అంతేకాకుండా.. ప్రజా పాలనలో వచ్చిన విజ్ఞప్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలని, చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేసిందో వాటిని కొనసాగించాలన్నారు దేశపతి శ్రీనివాస్.

WhatsApp: భారతదేశంలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయా..? కేంద్రం కీలక ప్రకటన..