NTV Telugu Site icon

Chhatrapati Shivaji: ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులు ఎక్కడ నివసిస్తున్నారు?

Shivaji

Shivaji

భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు, సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయన పేరు ఉంటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. చిన్నతనంలోనే మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించి పోతుందని, వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజు మండే నిప్పు కణికలా దూసుకొచ్చాడు. మొగల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు. అందుకే హిందూమతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆ యోధుడి జన్మదినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకలా జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక పండుగలా నిర్వహిస్తారు. అయితే.. ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులు ఉన్నారా? ఉంటే ఎక్కడ నివసిస్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం..

READ MORE: CAG Report: అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం.. 2023-24 బడ్జెట్ పూర్తి సమాచారం..

ఛత్రపతి శివాజీ మహారాజ్ 1680 ఏప్రిల్ 3న తన రాయ్‌గడ్ కోటలో మరణించాడు కానీ అతని వారసులు నేటికీ బతికే ఉన్నారు. మహారాష్ట్రలో నివసిస్తున్న ఉదయన్ రాజే భోసలే శివాజీ మహారాజ్ వారసులలో ఒకరు. ఆయన తండ్రి పేరు శ్రీ ప్రతాప్ సింగ్ మహారాజ్ భోసలే. ఉదయన్ రాజే భోసలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నివసిస్తున్నారు. ఉదయన్ రాజే భోసలే ఒక భారతీయ రాజకీయ నాయకుడు. మహారాష్ట్రలోని సతారా స్థానం నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు. ఆయన దమయంతిరాజేను నవంబర్ 20, 2003న వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు ఇటీవల.. బీజేపీ ఎంపీ ఉదయన్ రాజే భోసలే మొఘల్ చక్రవర్తులను కీర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔరంగజేబును దొంగ అన్నారు. గొప్ప వ్యక్తుల(ఛత్రపతి శివాజీ మహారాజ్) గురించి అనుచిత ప్రకటనలు చేసే వారిపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. “ఔరంగజేబును కీర్తించకూడదు. ఎందుకంటే అతను ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన దొంగ. ఓ దొంగను ఎందుకు కీర్తిస్తున్నారు? ఛత్రపతి శివాజీ మహారాజ్ పై తప్పుడు ప్రకటన చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. గొప్ప వ్యక్తుల గురించి అనుచిత ప్రకటనలు చేసే వారిపై ప్రత్యేక చట్టం తీసుకురావాలి.” అని ఉదయన్ రాజే భోసలే ప్రభుత్వాన్ని కోరారు.