Site icon NTV Telugu

Uttarakhand: గురుద్వారా దగ్గర కాల్పులు.. డేరా కరసేవ చీఫ్ తర్సేమ్ హత్య

Ded

Ded

ఉత్తరాఖండ్‌లో పట్టపగలే ఇద్దరు దుండగులు ఘాతుకానికి తెగబడ్డారు. ఉదమ్ సింగ్ నగర్‌లోని నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా ఆవరణలో డేరా కరసేవ చీఫ్‌ బాబా తర్సేమ్ సింగ్‌ను బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి.

ఉదయం 6:30 గంటల సమయంలో గురుద్వారా ప్రాంగణంలో కుర్చీపై కూర్చుని ఉండగా తర్సేమ్ సింగ్‌పై కాల్పులు జరిపారు. బైక్‌పై లోపలికి ఎంట్రీ ఇచ్చిన దుండగులు.. వచ్చిరాగానే కాల్పులకు తెగబడడంతో అక్కడికక్కడే తర్సేమ్ సింగ్‌ కుప్పకూలిపోయాడు. అనంతరం అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అయినా కూడా అతని ప్రాణాలు నిలువలేదు. మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఈ ఆలయం ధమ్ సింగ్ నగర్ జిల్లాలో రుద్రపూర్-తనక్‌పూర్ మార్గంలోని సిక్కుల పుణ్యక్షేత్రంగా ఉంది.

ఇది కూడా చదవండి: Aditi Marriage: సిద్ధార్థ్-అదితి సీక్రెట్ పెళ్ళిలో మరో ట్విస్టు.. షూటింగ్ అంటూ పర్మిషన్.. ఇప్పుడు అసలు పెళ్లే కాదట?

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఇక హత్యపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరాఖండ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని నానక్‌మట్టా ప్రాంతంలో అదనపు పోలీసు సిబ్బందిని మోహరించామని, శాంతిభద్రతలను కాపాడేందుకు సహకరించాలని సిక్కు సమాజానికి పోలీసులు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థకు 2047 వరకు తిరుగులేదు.. 8 శాతానికి పైగా వృద్ధి..

ఇక హత్య వెనుక ఏదైనా కుట్ర ఉందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. కేసు దర్యాప్తునకు కేంద్ర బృందాల సాయం కూడా కోరతామని వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీజీపీ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Punjab: మరోసారి తండ్రయిన ముఖ్యమంత్రి

 

Exit mobile version