Aditi Marriage: సిద్ధార్థ్-అదితి సీక్రెట్ పెళ్ళిలో మరో ట్విస్టు.. షూటింగ్ అంటూ పర్మిషన్.. ఇప్పుడు అసలు పెళ్లే కాదట?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aditi Rao Hydari Announces Engagement with Siddharth: సినీ హీరో సిద్ధార్థ హీరోయిన్ అదితి రావు హైదరిని వివాహం చేసుకున్నారని నిన్న మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. పెబ్బేరు మండలంలో ఉన్న రంగనాయక పురం రంగనాయక స్వామి ఆలయంలో వీరు రహస్యంగా పూజలు చేయడంతో వివాహం జరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి తోడు స్థానిక పూజారులను ఆలయంలోకి అనుమతించకుండా షూటింగ్ చేస్తున్నామని పర్మిషన్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. తమిళనాడు నుంచి పూజారులను తీసుకొచ్చి లోపలికి వెళ్లడంతో దాదాపుగా పెళ్లి అయిపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక ఇదే విషయం మీద ఎట్టకేలకు అదితీ రావు హైదరి సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తాను సిద్ధార్థతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసి అతను ఎస్ చెప్పాడు మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాము అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో వీరిద్దరికీ వివాహం జరిగిందంటూ జరుగుతున్న ప్రచారానికి బ్రేకులు పడినట్లు అయింది. సిద్ధార్థ 2003 వ సంవత్సరంలో తన చిన్ననాటి స్నేహితురాలు అయిన మేఘనను వివాహం చేసుకున్నారు. వివాదాలు రావడంతో ఇద్దరూ 2007వ సంవత్సరంలోనే విడాకులు కూడా తీసుకున్నారు. తర్వాత సిద్ధార్థ పలువురు హీరోయిన్లతో డేట్ చేసినట్లు వార్తలు వచ్చాయి కానీ ఎవరితోనో పెళ్లి వరకు వెళ్లలేదు. తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి సంస్థాన రాజ కుటుంబానికి చెందిన అదితీరావు హైదరికి కూడా గతంలోనే ఒక వ్యక్తితో వివాహం జరగగా వారి బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. వారు కూడా విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?