Site icon NTV Telugu

Deputy Speaker: పవన్ కళ్యాణ్ వస్తే గానీ టీడీపీ సభ నిర్వహించలేకపోయింది..

Kolagatla

Kolagatla

విశాఖపట్నంలో యువగళం విజయోత్సవ సభ కేవలం సీఎం జగన్ ని తిట్టటానికే ప్రాధాన్యత ఇచ్చారు అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పాదయాత్రలోని అనుభవాలను, ప్రజల సమస్యలను కనీసం సభలో చెప్పలేదు.. సీనియర్ అని చెప్పుకున్న చంద్రబాబు.. ఇటు పవన్ ని తీసుకు రావటానికి పడిన పాట్లు అందరూ గమనించారు.. ఇటు పవన్, అటు బాలయ్యను పెట్టుకొని సభను నిర్వహించారు.. ఎక్కడ నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించావో చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు. ఆందోళనలు, హార్తాలకు పిలుపు ఇచ్చావు కానీ ఎవ్వరూ పాల్గొనలేదని గుర్తించాలి.. ఎవ్వరూ నిన్ను నమ్మలేదు అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు.

Read Also: Dunki: థియేటర్స్ ఇవ్వలేదని ప్రభాస్ ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారు… #SRKsDISASTERDONKEY

చంద్రబాబు అధికార దాహంతోనే మా ప్రభుత్వంపై విమర్శకులు చేస్తున్నారు‌ అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అన్నారు. గతంలో ఎన్ని హామీలు ఇచ్చారు.. ఎందరికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి.. మీ కొడుకుకు ఉద్యోగం ఇచ్చావు గానీ మరెవ్వరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు.. పవన్ కళ్యాణ్ వస్తే గానీ మీరు సభ నిర్వహించలేకపోయావు.. ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటున్న మీరు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలలో పోటీ చెయ్యలేకపోతున్నారు.. ఎక్కడ ఓడిపోతామో అని భయంతో పొత్తులు పెట్టుకొనే ఎన్నికలకు వెళ్తున్నారు.. ఈసారి మీకు డిపాజిట్లు కూడా రావని చెబుతున్నామని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చెప్పుకొచ్చారు.

Exit mobile version