NTV Telugu Site icon

Pawan Kalyan: పీసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష..

Pawan 2

Pawan 2

పీసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఫ్యామిలీకి చెందిన కంపెనీల పర్యావరణ నిబంధనలపై ఆరా తీశారు. ద్వారంపూడి కుటుంబానికి చెందిన వీరభధ్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినట్లు పీసీబీ అధికారులు స్పష్టీకరణ చేశారు. వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదిలేస్తున్నట్లు గుర్తించారు. అనుమతుల ప్రకారం రోజుకి 25 టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 56 టన్నులు ఉత్పతి చేస్తున్నారని పీసీబీ నివేదిక ఇచ్చింది.

Read Also: Nag Ashwin: ప్రియాంకను పెళ్లి చేసుకోక పోతే కల్కి వచ్చేది కాదా?

ఎఫ్ల్యుయెంట్ టాంక్స్ లేకపోవడం, వ్యర్థ జలాలను బైపాస్ చేసి వదిలేస్తున్నారని అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో తెలిపారు. అంతేకాకుండా.. రొయ్యల వ్యర్థాలను సైతం పర్యావరణ నిబంధనలు పాటించకుండా పారేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ద్వారంపూడికి చెందిన వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పవన్ ఆదేశాలు ఇచ్చారు. 15 రోజుల్లోగా నోటీసులకు వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. ద్వారంపూడి సంస్థ నిబంధనలను ఉల్లంఘించడంపై లోతుగా విచారణకు పవన్ ఆదేశాలిచ్చారు.

Read Also: Punjab: శివసేన నాయకుడిపై కత్తులతో దాడి.. పట్టించుకోని జనాలు