Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. మరికాసేపట్లో ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా మామండూరు అటవి ప్రాంతానికి వెళ్లి, ఎర్రచందనం గోడౌన్లను పరిశీలిస్తారు. తర్వాత మంగళంలో ఉన్న ఎర్రచందనం నిల్వ గోదాములను సందర్శించనున్న పవన్ కల్యాణ్.. మధ్యాహ్నం కలెక్టరేట్‌లో అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. నిల్వలో ఉన్న ఎర్రచందనాన్ని విక్రయించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించనున్నారు. అలాగే శేషాచల కొండల్లో ఉన్న అరుదైన వన్యప్రాణులు, వృక్ష సంపదను కాపాడే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించనున్నట్లు సమాచారం.
Read Also: Samantha : రాజ్ నిడుమోరుకు సమంత హగ్.. కన్ఫర్మ్ చేసేస్తున్నారా..
కాగా, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది.. ఈ రోజు తిరుపతి జిల్లా ఎర్రచందనం డిపో పరిశీలన.. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధంపై సమీక్షలో పాల్గొననున్నారు పవన్ కల్యాణ్.. ఇక, రేపు.. అనగా ఈ నెల 9వ తేదీన పలమనేరులోని కుంకీ ఏనుగుల సంరక్షణ, ఏనుగుల మనుషుల మధ్య సంఘర్షణ నియంత్రణకు అనుసరిస్తున్న నూతన సాంకేతిక విధానాలను పరిశీలించనున్నారు.. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి.. వారితో ఒప్పందాలు కుదుర్చుకుని.. కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రప్పించిన విషయం విదితమే..
