NTV Telugu Site icon

Pawan Kalyan: రేపు ఢిల్లీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అమిత్ షాతో భేటీ

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: రేపు(బుధవారం) ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సాయంత్రం 6.30 గంటలకు ఆయన సమావేశం కానున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకుంటారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారు. రాష్ట్రానికి సంబంచిన పలు కీలక విషయాలను షాతో పవన్ చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పరిస్థితుల గురించి వివరించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల పవన్​ కల్యాణ్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేయడం, ఇప్పుడు ఢిల్లీకి వెళ్లడం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సరస్వతి పవర్​ ప్రాజెక్ట్​ భూములను మంగళవారం పవన్​ కల్యాణ్​ పరిశీలించారు. అమిత్​ షాతో ఏయే అంశాలు పవన్​ మాట్లాడుతారో వేచి చూడాల్సిందే.

 

Show comments