NTV Telugu Site icon

Pawan Kalyan: ఏపీలో చేపట్టిన బదిలీలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఏపీలో చేపట్టిన బదిలీలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్స్, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈఓ, డీఎల్‌డీఓ బదిలీల ప్రక్రియలో నిబంధనలను అనుసరించాలని అన్నారు. మాతృ శాఖలో ఉన్న అధికారులకే పోస్టింగ్స్ ఇవ్వడం చెప్పుకోదగిన పరిణామమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Read Also: Minister Nadendla Manohar: పవన్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మహాయాగం

బదిలీలకు ఉద్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలు పాటించడం వల్ల అప్రాధాన్యమైన స్థానాల్లో ఉన్నవారికి తగిన పోస్టింగ్స్ ఇవ్వడం సాధ్యమవుతుందని తెలిపారు. అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు పారదర్శకంగా కసరత్తు చేశారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ వివరించారు.

Show comments