NTV Telugu Site icon

Pawan Kalyan: తెలుగు వారికి ఓ గుర్తింపు ఇచ్చిన వ్యక్తి పొట్టి శ్రీరాములు

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: మన కోసం ఎవరు నిలబడ్డారో వారిని మరువ కూడదని.. కొందరు తల్లిదండ్రులను కూడా మర్చిపోతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. తెలుగు వారికి ఓ గుర్తింపు ఇచ్చిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని.. సమాజం కోసం బ్రతికిన మహానుభావులు పొట్టి శ్రీరాములు అని పవన్‌ వ్యాఖ్యానించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు.

Read Also: Vijayasai Reddy: 2027లో జమిలి ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయం

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొట్టి శ్రీరాములు గొప్పతనం మరింతగా తెలిసిందన్నారు. ఒక జాతికి, కులానికి పొట్టి శ్రీరాములు నాయకుడు కాదు.. ఆంధ్ర జాతికి శ్రీరాములు నాయకుడు అని ఆయన స్పష్టం చేశారు. మనం ఆంధ్రులుగా ఉన్నాం అంటే పొట్టి శ్రీరాములు బలిదానం కారణమన్నారు. 2047 విజన్ అనేది రాష్ట్ర భవిష్యత్ అని..2020 అంటే అప్పట్లో అందరికీ అర్థం కాలేదన్నారు. ఇప్పుడు 2020 విజన్ ఫలితాలు ఏంటో అందరికీ తెలుస్తున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు.

 

Show comments