NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఇంటి స్థలానికి ఏలేరు ఎఫెక్ట్

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో గత వారం భారీ వర్షాలు కురవడంతో విజయవాడ వంటి పలు నగరాల్లో తీవ్రంగా వరదలు ఏర్పడ్డాయి. కొంతమంది ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఇంట్లో ఉన్న సామాన్లతో సహా అన్నింటిని కోల్పోయారు. దీంతో కొంతమంది వరద బాధితులకు వారికి తోచినంతగా సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వరద బాధితుడిగా మారారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ కూడా వరదకు ఎఫెక్ట్ అయ్యారు. పవన్ ఇంటి స్థలం ఏలేరు వరద ముంపుకు గురైంది. పిఠాపురం వై.జంక్షన్ వద్ద పవన్ కల్యాణ్ ఇంటి స్థలం నీట మునిగింది.

Read Also: Minister Kollu Ravindra: అక్టోబర్‌ నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం

ప్రస్తుతం ఆయన ఇంటి స్థలం వరద నీటితో మునిగిపోయి చెరువును తలపిస్తోంది. పవన్ ఇంటి స్థలానికి కూత వేటు దూరంలో ఏలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద ఉగ్రరూపం దాల్చడంతో పవన్ ఇంటి స్థలం పరిసరాలు చెరువును తలపిస్తు్న్నాయి. పిఠాపురం శివారు 216 జాతీయ రహదారి పక్కన వై.జంక్షన్ వద్ద పవన్ కల్యాణ్ 3.5 ఎకరాల స్థలం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా గెలిస్తే పిఠాపురంలో సొంత ఇల్లు కట్టుకుంటానని పవన్ గత ఎన్నికల్లో ప్రకటించారు. తాజాగా ఏలేరు వరద ప్రభావంతో ఇంటి స్థలం నీటి ముంపులో చిక్కుకుంది.

Show comments