Site icon NTV Telugu

Pawan Kalyan: వాలంటీర్ వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్

Pawan Kalyan Speech

Pawan Kalyan Speech

అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామ రాజు జిల్లాలో నిన్న, నేడు పర్యటిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయి రోడ్ల అభివృద్ధికి పవన్ చొరవతో అడుగులు పడుతున్నాయి. కాగా ఈ పర్యటనలో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ ను కలిశారు. తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వాలంటీర్ వ్యవస్థపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “మీరు ఏ విభాగం కిందకు వస్తారో.. జీతాలు ఎలా ఇచ్చారో చెప్పకుండానే వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని వంచించిందని చెప్పారు.

Also Read:YS Jagan: లింగమయ్య కుటుంబానికి జగన్‌ పరామర్శ.. సర్కార్‌పై సంచలన ఆరోపణలు..

వాలెంటీర్ అనే పదానికి అర్ధం ఏంటో కూడా తెలియదు.. ఆ విధంగా గత ప్రభుత్వం మోసం చేసింది.. అనేక సార్లు వాంటర్లపై చర్చించాం.. మరోసారి కేబినెట్ దృష్టికి తీసుకుని వెళతాను.. వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పాం.. కానీ వాలంటీర్లు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పని చేశారు.. వాలంటీర్లకు సంబంధించి ఏ పేపర్ వర్క్ ప్రభుత్వం దగ్గర లేదు.. అసలు వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లు అధికారికంగా దాఖలాలే లేవు.. ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి వాలంటీర్లను మభ్యపెట్టారని” డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Exit mobile version