Selfie Challenge: ఆంధ్రప్రదేశ్‌లో సెల్ఫీ ఛాలెంజ్ కొనసాగుతోంది.. ఇప్పటి వరకు నారా లోకేష్, చంద్రబాబు.. సీఎం వైఎస్ జగన్, వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్‌లు విసరగా.. ఇప్పుడు వైసీపీకి కూడా ఈ ఛాలెంజ్‌లోకి దిగింది.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. గంగాధర నెల్లూరు మండలంలోని నిర్మిస్తున్న సాఫ్ట్ వేర్ కంపనీ Smart DV కంపెనీ నిర్మాణం వద్ద సెల్ఫీ దిగిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి.. మరో రెండు నెలల్లో సీఎం వైఎస్ జగన్ చేతులమీదుగా ప్రారంభం కాబోతోంది… దేశంలో తొలిసారి గ్రామీణ ప్రాంతమైన కొత్తపల్లిమిట్ట సమీపంలో సుమారు ఐదు ఎకరాల స్థలంలో, పది అంతస్తులతో నిర్మిస్తున్న స్మార్ట్ డీవీ కంపెనీ ఇదే నంటూ పేర్కొన్నారు.
రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మెన్ విజయానందరెడ్డిల ప్రత్యేక చొరవతో జిడి నెల్లూరులో సాఫ్ట్ వేర్ దిగ్గజమైన స్మార్ట్ డీవీ కంపెనీ నిర్మాణం సాగిస్తుందన్నారు నారాయణస్వామి.. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు సుమారు 5 వేల మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు రూపొందించడమే ప్రధాన లక్ష్యంగా స్మార్ట్ డీవీ సంస్ధ ముందుకు సాగుతోంది.. ఇక, తన నియోజకవర్గంలో ఇప్పటికే నిర్మాణ పనులు దాదాపు పూర్తై , ఉద్యోగస్తుల ఎంపిక ప్రారంభమవ్వడంతో ఉబ్బితబ్బిబ్బై సెల్ఫీ ఛాలెంజ్‌కు దిగారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. ఆయనతో పాటు సెల్ఫీ ఛాలెంజ్‌లో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీ ఛైర్మన్ వాసు ఉన్నారు.
పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన సొంత జిల్లాలో కొత్త కంపెనీలను నెలకొల్పలేదని ఆరోపించారు నారాయణస్వామి.. ప్రజలకు, రైతులకు పనికొచ్చే విజయా డైరీ, షుగర్ ఫ్యాక్టరీ లాంటి ప్రభుత్వ రంగ సంస్ధలను మూసి వేసినా ఘనత చంద్రబాబుదేనని మండిపడ్డారు.. జిల్లాలో ఒక్కటైనా కంపెనీ పెట్టావా? అంటూ ఫోటో దిగి చంద్రబాబుకు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.