Site icon NTV Telugu

Dy Cm Narayana Swamy: డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు

Narayana Swamy

Narayana Swamy

డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఏం మాట్లాడినా సంచలనమే. జగన్ కేబినెట్లో రెండోసారి బెర్త్ కన్ ఫర్మ్ చేసుకున్న నారాయణ స్వామి తరచూ ఏవో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ వుంటారు. తాజాగా ఆయన చేసిన కామెంట్లు కాకరేపుతున్నాయి. వైసీపీలో తనపై కుట్ర జరుగుతోందని, నాతప్పు ఉందని…అవినీతి చేశాను ఎవరైనా నిరుపిస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటానన్నారు నారాయణ స్వామి. రేపు జగనన్నకు నాపై నిజంగా తీవ్రంగా కోపం వచ్చే పరిస్థితి కూడా వస్తా ఉందన్నారు. వైసీపీలో పార్టీ శ్రేణులు, అమాయక ప్రజలను రెచ్చగొడితే వారిని పార్టీ నుంచి బహిష్కరించే రోజులొస్తాయన్నారు నారాయణ స్వామి.

Read Also: Bandi sanjay: అసోం సీఎంను మాట్లాడనీయకుండా మైక్ లాక్కోవడం హేయమైన చర్య

పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లు పార్టీని వదిలి వెళ్లిపోవాలన్నారు. కుట్రంతా గంగాధరనెల్లూరు నియోజక వర్గంలోని ఒక మండలంలోనే జరుగుతోందని బాంబు పేల్చారు నారాయణస్వామి. ‘నన్ను అవమానించిన విషయం చెబితే ఎంతవరకు పోతుందో, ఏమవుతుందో ఆ మనిషికి తెలియడం లేదన్నారు. ప్రభుత్వంలో ముఖ్య హోదాలో ఉన్న ఒక నాయకుడికి నియోజక వర్గంలో ఒకే ఒక మండలంలోని ఒక నాయకుడికి 13 కోట్ల నుంచి 14 కోట్ల రోడ్డు పనులు కూడా ఇచ్చానన్నారు. కానీ నియోజక వర్గంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు ఈ నెల 11వ తేదీన పెనుమూరు మండలం రావాలంటూ నాకు వ్యతిరేకంగా మెసేజ్ లు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడు వల్ల తాను స్పందించాల్సి వచ్చిందన్నారు. మరి వైసీపీ నేతలు నారాయణ స్వామి కామెంట్లపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Errabelli Dayakar Rao: అసోం సీఎంపై ఫైర్.. ఆయన వల్లే హైదరాబాద్‌లో ఉద్రిక్తత

Exit mobile version