NTV Telugu Site icon

Bhatti Vikramarka : బీబీనగర్ ఎస్సీ, బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీబీనగర్ ఎస్సీ, బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆయన, మార్గమధ్యంలో ఈ పాఠశాల వద్ద ఆగి విద్యార్థుల సమస్యలు, సౌకర్యాలపై సమీక్ష చేశారు. ఈ సందర్బంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ తో కలిసి విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజన మెనూ, కాస్మోటిక్ ఛార్జీల నిధుల వినియోగం, శుభ్రత, పాఠశాల నిర్వహణపై ఆరా తీశారు. ప్రత్యేకంగా, డైట్ ఛార్జీల పెంపు ముందు, తర్వాత పాఠశాలలో తీసుకువచ్చిన మార్పులను విశదీకరించారు.

Tollywood 2024 : టాలీవుడ్ లో అడుగుపెట్టిన ముద్దుగుమ్మలు వీరే

భట్టి స్వయంగా తరగతి గదులు, స్టోర్ రూమ్‌లు పరిశీలించి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితుల పై వివరాలను రిజిస్టర్ల ద్వారా తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను కూడా జాగ్రత్తగా పరిశీలించారు. విద్యార్థులు, బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు, అభ్యర్థనలను విన్నారు.

రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని, వారిని సమర్థవంతమైన పౌరులుగా తీర్చిదిద్దటమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన పోషణ, శ్రేయస్సు కోసం డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలను పెంచినట్లు తెలిపారు. బీబీనగర్ రెసిడెన్షియల్ పాఠశాల సందర్శన ద్వారా విద్యార్థుల కల్పనాత్మక అభివృద్ధికి తమ ప్రభుత్వ కృషిని నేటి యువతికి మరింత దగ్గర చేయాలని భట్టి సంకల్పించారు. ఈ పర్యటన ద్వారా పాఠశాల నిర్వహణ లోని లోపాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడమే లక్ష్యమని తెలిపారు.

KTR: నయవంచన, మోసం అనే పదాలు కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ..

Show comments