NTV Telugu Site icon

Bhatti Vikramarka: ఇరిగేషన్ ప్రాజెక్టులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష

Batti

Batti

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పలువురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.

Read Also: INDW VS ENGW: ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన భారత అమ్మాయిలు

ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావాలంటే గత ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రాజెక్టుల పనులు ఆపకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న డిండి, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెళ్ళాంల, ఎస్ఎల్ బీసీ టన్నెల్, నక్కల గండి రిజర్వార్ల పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. అలాగే పిలాయిపల్లి కెనాల్, ధర్మ రెడ్డి కెనాల్ పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని మండలి ఛైర్మన్ కోరారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తగినంత బడ్జెట్ ను కేటాయించాలని ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు సుఖేందర్ రెడ్డి సూచించారు.

Read Also: MK Stalin: హిందీ జాతీయ భాష కాదు.. తమిళ మహిళపై వేధింపుల తర్వాత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు..

ఇక, ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు ప్రాజెక్టులను సందర్శించి, పనులు త్వరగా అయ్యేలా చూడాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు ఎంత వరకు పూర్తి అయ్యాయి.. ఇంకా ఎంత శాతం పనులు పెండింగ్ లో ఉన్నాయి.. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం ఎంత నిధులను ఖర్చు చేసింది.. అలాగే ఇంకా ఎంత నిధులు అవసరం ఉన్నాయనే పూర్తి నివేదికను గుత్తా సుఖేందర్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఇరిగేషన్ అధికారులకు అందించారు. ప్రాజెక్టులు పూర్తి అయితే జిల్లాలో నీటి సమస్య ఉండదని.. త్వరగా పనులు పూర్తి అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. గుత్తా లెవనేత్తిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.