తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. రుణమాఫీపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట అమలు చేశామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రుణమాఫీ చేశామన్నారు. జనగామలో 2018లో 19,306 అకౌంట్లలో రూ.124 కోట్లు వేశారు.. తాము 263 లక్షల కోట్లు రుణమాఫీ చేశామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సిద్ధిపేటలో బీఆర్ఎస్ రూ. 96.62 కోట్లు రుణాలు మాఫీ చేస్తే.. తాము రూ.177 కోట్లు మాఫీ చేశామన్నారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ రూ.101 కోట్లు మాఫీ చేస్తే.. తాము రూ.175.84 కోట్లు మాఫీ చేశామని చెప్పారు. నిర్మల్‌లో బీఆర్ఎస్ హయంలో రూ.110 కోట్లు ఇచ్చారు.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.202 కోట్లు మాఫీ చేసిందని డిప్యూటీ సీఎం తెలిపారు.
Read Also: Rohit Sharma: టెస్టు కెప్టెన్సీపై యూటర్న్ తీసుకున్న బీసీసీఐ? మరింతకాలం రోహిత్ శర్మ నాయకత్వంలోనే!
శాసన సభ ప్రాంగణంలో రైతు బందు, రైతు భరోసా లిస్ట్ పెడతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శాసన సభలో ప్రతిపక్ష సభ్యుల నియోజక వర్గాలపై రుణమాఫీ వివరాలను భట్టి విక్రమార్క బయట పెట్టారు. రుణమాఫీపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలపై డిప్యూటీ సీఎం కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయంలో చేసింది ఎంత..? ఇప్పుడు చేసింది ఎంత అనే వివరాలు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సభలో ప్రకటించారు. ప్రతీ గ్రామాల్లో జాబితా పెడతాం.. అన్ని వివరాలు బయట పెడతామన్నారు. గృహ జ్యోతి 115 నియోజక వర్గాల సమాచారం తమ దగ్గర ఉందని భట్టి తెలిపారు. లబ్ధిదారుల అందరికీ తెలుసు.. తాము చెప్పిన హామీలు అమలు చేస్తామని అన్నారు. తాము చేసేది ప్రజల కోసమేనని.. మీలాంటి రాజకీయ పార్టీలకు కాదని బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు.
Read Also: TGPSC: టీజీపీఎస్సీ ముందు భారీగా పోలీస్ బందోబస్తు..
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రుణమాఫీ తమ జిల్లాకే 6 వేల కోట్ల అయ్యాయని చెప్పారు. బోనస్ బకాయిలు త్వరలోనే ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో రూ.21 వేల కోట్లు ఒకేసారి రుణమాఫీ చేశాం.. మీలాగా లక్ష మాఫీ చేస్తాం అని నాలుగేండ్లు వడ్డీకి సరిపోలేదని బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కడలేని విధంగా తాము చేస్తే బీఆర్ఎస్ ఓర్వలేక పోతుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.