Site icon NTV Telugu

Bhatti Vikramarka : అంతా కలిసి రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి

Bhatti Vikramarka

Bhatti Vikramarka

మనం అందరం కలిసి రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్పీడీసీఎల్ లో పదోన్నతులు పొందిన అధికారులు, ఉద్యోగులు డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లును పెద్ద ఎత్తున అభినందించగా ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల జీవితాల్లో మార్పు అంటే వారి జీవనస్థితిగతులు మారడం, కొనుగోలు శక్తి పెరగడం, రాష్ట్ర సంపదలో అంతా భాగస్వాములు కావడం ఆ మార్పు వచ్చినప్పుడే పోరాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రానికి ఫలితం ఉంటుంది అన్నారు. లేకపోతే కోరి తెచ్చుకున్న కొత్త రాష్ట్రంలో న్యాయం చేయలేని వారిగా నిలబడిపోతాం అన్నారు. గత ఏడు, ఏడున్నర సంవత్సరాలుగా పదోన్నతులు లేకుండా ఎదురుచూస్తున్న విద్యుత్ ఉద్యోగులందరినీ ప్రజా ప్రభుత్వం గుర్తించి పదోన్నతుని ఇవ్వాలని నేను, సీఎం, మంత్రిమండలి సభ్యులు నిర్ణయించామని తెలిపారు. మీరంతా కూడా ఈ రాష్ట్రం నాది, ఈ ప్రభుత్వం నాది, ఈ రాష్ట్ర ప్రజలు నా వాళ్ళు, వాళ్ల సేవ కోసమే నేను నియమించబడ్డారని మీరంతా భావించాలని ఉద్యోగులు, అధికారులకు సూచించారు.

Jaya Krishna Ghattamaneni : మహేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. తల్లోంచి ఊడిపడినట్టున్నాడుగా!

ప్రభుత్వ పరంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఉద్యోగులు అధికారులు బాగా పనిచేసే వాతావరణ కల్పించడం కోసం పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఆలోచనలను అమలు చేసే క్రమంలో కింది స్థాయి వరకు ఉద్యోగులు, అధికారులు నిబద్ధతతో పనిచేయాలని తెలిపారు. మీ కష్టసుఖాల్లో ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది, మీరు ప్రజల కష్టసుఖాల్లో భాగం కావాలని సూచించారు. అధికారులు, ఉద్యోగులు పెట్టే ప్రతి సంతకం, తీసుకునే ప్రతి నిర్ణయం, చేసే ప్రతి పని సామాన్యునికి ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. మీ పనిలో మానవీయకోణం ఉండాలని సూచించారు. భవిష్యత్తులోనూ ఉద్యోగులకు ప్రజా ప్రభుత్వం ఇదే తరహా ప్రోత్సాహాన్ని కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న అందరిని సంప్రదించి తీసుకుంటుంది.. టీం స్పిరిట్ తో ముందుకు పోవాలని అన్నారు. పదోన్నతులు పొందిన అధికారులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. మీ పిల్లలు బాగా చదువుకోవాలని సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

Kolkata doctor case: డాక్టర్ హత్యాచార ఘటనలో కీలక మలుపు.. ‘‘పాలిగ్రాఫ్ టెస్ట్’’కి హైకోర్టు అనుమతి..

Exit mobile version