సామాజిక సాధికార బస్సు యాత్ర ఒక విప్లవం అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. అణగారిన కుటుంబాలకు, కులాలకు అండగా నిలబడిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు అయిన సామాజిక సాధికారత ఒక మాట గా మాత్రమే ఉంది.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే సామాజిక సాధికారత ఒక నినాదంగా మారింది అని ఆయన పేర్కొన్నారు. వెనుక బడిన వర్గాలను ఓటు బ్యాంక్ గా చూడలేదు.. నా అని కుటుంబంలో సీఎం ముఖ్య మంత్రి జగన్ కలుపుకున్నారు అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు.
Read Also: IPL 2024 Auction: వీడిన సస్పెన్స్.. దుబాయ్లోనే ఐపీఎల్ వేలం పాట..!
గత ప్రభుత్వంలో మైనార్టీలకు క్యాబినెట్ లో చోటు లేదు అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న నాకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు.. ఇది చారిత్రాత్మకంగా నేను భావిస్తున్నా.. గత టీడీపీ పాలన లో 2650 కోట్లు ఖర్చుపెట్టారు.. కానీ, వైసీపీ ప్రభుత్వంలో 26 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి సామాజిక వర్గాన్ని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్.. సీఎం జగన్ దేవుడిని, దేవుళ్ళ లాంటి ప్రజలను మాత్రమే నమ్ముకున్నాడు అని బాషా పేర్కొన్నారు. జగన్ ను ఎదుర్కొలేని పార్టీలు సిద్దాంతాలు పక్కన పెట్టి ముకుమ్మడిగా వస్తున్నారు.. కానీ, సీఎం జగన్ సింహం లాంటి వ్యక్తి, సింగిల్ గా వస్తున్నాడు ఆశీర్వదించండి అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు.