Site icon NTV Telugu

Pawan Kalyan : ఏకతాటిపై నిలబడాల్సిన సమయం ఇది

Pawan Kalyan

Pawan Kalyan

జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 25 మంది భారతీయులు కాగా, ఒకరు నేపాల్‌కి చెందిన వ్యక్తి. ఈ దాడిలో 25 మంది భారతీయులలో ఇద్దరు తెలుగు వ్యక్తులు కూడా ఉన్నారు. నెల్లూరులోని కావలికి చెందిన మధుసూదన్ రావు, విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. రువారం మధ్యాహ్నం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధుసూదన్ రావు ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఈ ప్రమాదంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ఇంటికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రమౌళి కుటుంబం ఈ ఘటనను తలచుకుని తీవ్రంగా విలపించింది. పవన్ కల్యాణ్ వారిని ఓదార్చి, ప్రభుత్వం వారి పక్షాన నిలుస్తుందని ధైర్యం చెప్పారు.

 

పవన్ కల్యాణ్ పహల్గామ్ ఘటనపై మాట్లాడుతూ… ఏకతాటిపై నిలబడాల్సిన సమయం ఇది అని, టెర్రరిజానికి మతం లేదన్నారు. కానీ.. పహల్గామ్‌ ఘటనలో మాత్రం హిందువులను టార్గెట్‌ చేసి చంపారన్నారు. కల్మా చదవమన్నారని, రాదని చెప్పిన వారిని మోకాళ్లపై కూర్చోబెట్టి బుల్లెట్లు దింపారని బాధితులు చెబుతుంటే బాధాకరంగా అనిపించిదని ఆయన తెలిపారు. అమానుషంగా చంపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు తమ బాధను తను చెప్పుకున్నప్పుడు నోటివెంట మాటలు రాలేదని ఆయన అన్నారు. ఇది అందరి బాధ్యత అని, ఇది పూర్తి ఖండిచాల్సిన విషయమన్నారు. పార్టీలకు అతీతంగా ఈ మారణ హోమాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాలన్నారు.

Exit mobile version