NTV Telugu Site icon

Fake Currency in ATM: ఏటీఎంలో నకిలీ నోట్ల కలకలం.. ఫేక్‌ కరెన్సీ డిపాజిట్‌

Fake Currency

Fake Currency

Fake Currency in ATM: ఏటీఎంలో డబ్బులు డిపాజిట్‌ చేశారంటే ఆ నోట్లను పరిశీలించిన తర్వాతే ఆ తంతు జరుగుతుంది.. అయినా, కొన్నిసార్లు నకిలీ నోట్లు కలకలం రేపుతుంటాయి.. ఇక, ఈ మధ్య డిపాజిట్‌ మెషన్లు అందుబాటులోకి వచ్చాయి.. వినియోగదారుల రద్దీ ఉండే ప్రాంతాల్లో ఆయా బ్యాంకులు ఈ డిపాజిట్‌ మెషన్లను ఏర్పాటు చేస్తున్నాయి.. అయితే, ఓ డిపాజిట్‌ మెషన్‌లో నకిలీ నోట్లు డిపాజిట్‌ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.. టెక్కలిలోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఏటీఎం కం డిపాజిట్‌ మెషన్‌లో దొంగ నోట్లు డిపాజిట్‌ చేశారు.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. గత నెల 29వ తేదీన అర్ధరాత్రి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో 44 వేలు అంటే 88 ఐదు వందల నకిటీ నోట్లను డిపాజిట్ చేశారు.. ఏటీఎంలో డబ్బు నిల్వ చేసేందుకు తెరవడంతో ఈ వ్యవహారం బయటపడింది.. దీనిపై పోలీసులను ఆశ్రయించారు టెక్కలి యాక్సిస్ బ్యాంక్ మేనేజర్.. ఇక, సంబంధిత బ్యాంక్‌ మేనేజర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Read Also: Allu Arha: అల్లు అర్జున్ కూతురా..? మజాకానా..? అట్లుంటుంది అర్హతో..