NTV Telugu Site icon

UP: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో.. యూపీ సీఎం యోగి కీలక నిర్ణయం

Yogi Adityanath

Yogi Adityanath

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై వివాదం ముదురుతోంది. శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రసాదంగా సమర్పించిన ప్రసాదంలో కల్తీ జరిగినట్లు వచ్చిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. లడ్డూల్లో జంతువుల కొవ్వు కలపడంపై సాధువులు, సన్యాసులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ లడ్డూ వివాదానికి సంబంధించి సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్ వచ్చింది. తాజాగా.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం మధురకు చెందిన ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం , బృందావనం తదితర ప్రాంతాల్లోని ధార్మిక క్షేత్రాలకు సమీపంలోని 15 దుకాణాల నుంచి 43 ఆహార పదార్థాల నమూనాలను సేకరించింది. కల్తీ పదార్థాలను వాడుతున్నారనే అనుమానంతో లక్నోలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి ‘పేడా’ (ఒక రకమైన స్వీట్) నమూనాను పరీక్షల నిమిత్తం పంపింది.

READ MORE: Amaravati: రాజధానిలో తొలి భూ కేటాయింపు చేసిన కూటమి ప్రభుత్వం

ఎఫ్‌ఎస్‌డిఎ అసిస్టెంట్ కమిషనర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. సోమవారం మధుర, బృందావన్‌లలో నిర్వహించిన నమూనా ప్రచారంలో 15 మంది వ్యాపారుల‌ నుంచి మొత్తం 43 నమూనాలను సేకరించినట్లు తెలిపారు. మిఠాయిలు, పాలు, పనీర్, పెడా, బర్ఫీ, మిల్క్ కేక్, రసగుల్లా, సోన్‌పాప్డి, ఇతర స్వీట్లు మసాలా దినుసులతో తయారుచేసిన వ‌స్తువులను లాబ్ కు పంపించారు. వాటిలో 42 స్టాండర్డ్‌లో ఉన్నట్లు గుర్తించామని, అయితే ‘పెడా’ నమూనాను పరీక్ష కోసం లక్నోకు పంపామని ఆయన చెప్పారు. ఆలయాల చుట్టుపక్కల ఉన్న దుకాణాల నుంచి ఆదివారం, సోమవారాల్లో అన్ని నమూనాలను సేకరించినట్లు తెలిపారు.

READ MORE:Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల భారీ వర్షం

ఇదిలా ఉండగా.. మార్కెట్‌లో నెయ్యిలో కల్తీ జరుగుతోందన్న అంశాన్ని లక్నోలోని పురాతన మంకమేశ్వర దేవాలయం అధిపతి మహంత్ దేవ్యగిరి లేవనెత్తారు. బయటి నుంచి తెచ్చిన ప్రసాదాన్ని మంకమేశ్వరాలయంలో సమర్పించబోమని మహంత్ దేవయగిరి స్పష్టం చెశారు. ప్రజలు ఇంట్లో తయారుచేసిన ప్రసాదం తీసుకువస్తేనే దేవుడికి నైవేద్యంగా పెడతారు. అలాగే, భక్తులు స్వామికి పొడి ప్రసాదాన్ని సమర్పించవచ్చన్నారు. సనాతన ధర్మ బోర్డును దేశం, రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

READ MORE:Karnataka: రెండు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లకు ఉర్దూ తప్పనిసరి.. “ముస్లిం బుజ్జగింపు” అని బీజేపీ ఫైర్..

అలాగే, నగరంలోని ప్రధాన ఆలయాల మహంతులు, ప్రధాన అర్చకులను కూడా చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ బోర్డుకు న్యాయపరమైన అధికారం రావాలనే డిమాండ్ ను కూడా లేవనెత్తారు. దీనితో పాటు, మతపరమైన ప్రదేశాలలో (ఆలయాల్లో) ప్రసాదంగా విక్రయించే వస్తువులపై విచారణ జరపాలని మహంత్ దేవ్యగిరి డిమాండ్ చేశారు. ఇందులో అవినీతిపరులు ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో విచారణ చేపట్టాలన్నారు. విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ కి లేఖ రాశారు. మహంత్ దేవ్యగిరి తన డిమాండ్ల లేఖను సీఎం యోగి పేరిట సోమవారం లక్నో డీఎం సూర్యపాల్ గంగ్వార్‌కు అందజేశారు.