సార్వత్రిక ఎన్నికల్లో కుమారుడు వరుణ్ గాంధీకి టికెట్ దక్కకపోవడంపై తొలిసారి తల్లి మేనకాగాంధీ స్పందించారు. వరుణ్‌పై తనకు విశ్వాసం ఉందని.. సమర్థవంతుడైన నాయకుడు అని కొనియాడారు. అయితే పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ లోక్‌సభ స్థానానికి వరుణ్‌గాంధీ ప్రతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించింది. మరొకరికి ఈ సీటును కేటాయించింది. దీంతో ఆయన నిరాశ చెందారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. తాజాగా తల్లి మేనకాగాంధీ స్పందిస్తూ.. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి: TSRTC: ఇక టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లకు బంద్.. ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు..
ఇక వరుణ్‌గాంధీ ముక్కుసూటి మనిషి అని.. తన అభిప్రాయాన్ని సూటిగా చెబుతూ ఉంటారని చెప్పుకొచ్చారు. బహుశా అదే అతనికి ఇబ్బందికరంగా మారి ఉంటుందని చెప్పుకొచ్చారు. అయినా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ప్రజల కోసం తన కుమారుడి ప్రయాణం కొనసాగుతుందని ఆమె చెప్పారు.
ఇది కూడా చదవండి: Cine Politics: పిఠాపురానికి అల్లు అరవింద్.. వైసీపీ ఫ్రెండ్ కోసం బన్నీ!
పిలిభిత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా వరుణ్‌గాంధీ గెలిచారు. ఈసారి మాత్రం టికెట్ దక్కలేదు. ఇక మేనకాగాంధీ ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచారు. మరోసారి టికెట్ దక్కడంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వరుణ్‌గాంధీ విమర్శలు చేశారు. అంతేకాదు.. కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా కలిశారు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రస్తుతం ఆయన ఎక్కడ నుంచి నామినేషన్ దాఖలు చేయలేదు.
ఇది కూడా చదవండి: CM Jagan: వంగా గీత, భరత్కు బంపర్ ఆఫర్.. వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవులు