NTV Telugu Site icon

Hyderabad: మూసీ రివర్‌ బెడ్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

Demolitions

Demolitions

Hyderabad: మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవిన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. మూసీ రివర్ బెడ్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తొలగిస్తున్నారు. మలక్‌పేట పరిధిలోని శంకర్‌ నగర్‌లో స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. పునర్నివాసంలో భాగంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను రెవెన్యూ అధికారులు నిర్వాసితులకు అందజేశారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లలోకి షిఫ్ట్ అయ్యిన వారి నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. 47 గంటల పాటు కూల్చివేతలు కొనసాగనున్నాయి. చాదర్‌ఘాట్ సమీపంలో అక్రమ నిర్మాణాల తొలగింపు కొనసాగుతోంది. మూసీ రివర్‌ బెడ్‌లో కూల్చివేతలతో తమకు ఎలాంటి సంబంధం లేదని హైడ్రా ప్రకటించింది.

Read Also: CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం!

మరోవైపు అంబర్‌పేట్‌ నియోజకవర్గం గోల్నాక డివిజన్ తులసి రామ్ నగర్‌లో మూసీ పరీవాహక ప్రాంత వాసులను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. తులసిరాం నగర్‌లో ఎవరి ఇంటికి బుల్డోజర్ వచ్చిన అందరూ అడ్డుపడాలన్నారు. ఏం ఇచ్చినా మీరు ఇక్కడి నుంచి కదలొద్దన్నారు. ఒకరి ఇల్లు కూలుతుంటే మిగతా వాళ్లు ఇంట్లో ఉండకూదన్నారు. అందరికీ అండగా ఉంటామన్నారు.మీకు అండగా ఉండాలని, మిమ్మల్ని పరామర్శించమని కేసీఆర్ చెప్పారన్నారు. అందుకే వచ్చామన్నారు.

Show comments