Site icon NTV Telugu

Karnataka: రైతును పెళ్లి చేసుకునే అమ్మాయికి రూ. 5 లక్షలు..

Karnataka

Karnataka

Farmer Marriage: కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌కు ముందు సంప్రదింపుల కసరత్తులో భాగంగా సీఎం సిద్ధరామయ్య రైతు సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై సభకు హాజరైన నేతలు హర్షం వ్యక్తం చేయగా.. రైతు సంఘంలో పౌష్టికాహారం పెంపుదల, సరస్సుల అభివృద్ధి, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ అధికారుల నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు రైతు వర్గాల యువతలో ఆశలు రేకెత్తించేలా బడ్జెట్‌లో కార్యక్రమాలు చేపట్టాలని ఈ భేటీలో రైతుల నుంచి చాలా డిమాండ్లు వచ్చాయి.

Read Also: Pakistan Elections 2024: పీపీపీతో కలిసి సంకీర్ణ సర్కార్‌ ఏర్పాటుకు పీఎంఎల్‌-ఎన్‌ ప్రయత్నాలు!

అయితే, ముఖ్యంగా రైతు యువకుడిని పెళ్లి చేసుకునే యువతికి 5 లక్షల రూపాయల ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సీఎం సిద్ధరామయ్యను రైతులు కోరారు. సేద్యాన్ని నమ్ముకుని, ఏటా లక్షల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నా.. 45 ఏళ్లు వస్తున్నప్పటికీ యువ రైతులకు వివాహం కావడం లేదని రైతు సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, రైతు రుణమాఫీతో పాటు రైతును వివాహం చేసుకునే అమ్మాయికి 5 లక్షల రూపాయల ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సిద్ధరామయ్యకు రైతు సంఘాల నాయకులువినతి పత్రాన్ని అందించారు. రాష్ట్ర బడ్జెట్ లో సేద్యానికి, వ్యవసాయ కార్మికులకు, రైతులకు నిధుల కేటాయింపునకు సంబంధించి రైతు సంఘాలకు చెందిన 218 మంది రైతులతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సమావేశం అయ్యారు.

Exit mobile version