NTV Telugu Site icon

Delhi Weather: ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత.. నేడు తేలికపాటి వర్షం!

Delhi Coldest Day

Delhi Coldest Day

Light Rain Expected in Delhi Today: ఈ శీతాకాలంలో భారత దేశం అంతటా ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఈ సీజన్‌లో దేశ రాజధాని ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం 5.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఇది ఈ సీజన్ సగటు కంటే రెండు నాచులు తక్కువగా ఉంది. ఇక ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 17.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని ఐఎండీ పేర్కొంది.

Also Read: Indonesia Earthquake: ఇండోనేషియాలో భూకంపం.. రిక్ట్కర్‌ స్కేల్‌పై 6.7 తీవ్రత!

మంగళవారం ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి వర్షం లేదా చిరు జల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. నేడు 15 డిగ్రీల సెల్సియస్ గరిష్ట, 6 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీతో పాటు పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఉంటుందని ఐఎండీ పేర్కొంది. హర్యానా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు బీహార్‌లో ఇదే పరిస్థితి ఉంటుందనిచెప్పింది. పంజాబ్, హర్యానాలో వచ్చే 3 రోజులలో దట్టమైన పొగమంచు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానాలతో పాటుగా రాజస్థాన్‌లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.